Bigg Boss 7 Day 76 : ఇక నుంచి కెప్టెన్సీ టాస్క్ లు ఉండవు.. ఆ పదాలు బ్యాన్.. కంటెస్టెంట్స్ కి వీకెండ్ షాక్ ఇచ్చిన నాగార్జున..

శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున(Nagarjuna) వచ్చారు. శనివారం ఎపిసోడ్ లో వారం అంతా కంటెస్టెంట్స్ ఏం చేశారో చూపించి వాళ్లకి క్లాస్ పీకుతారని తెలిసిందే. ఈ వారం కూడా అదే చేశారు.

Bigg Boss 7 Day 76 : ఇక నుంచి కెప్టెన్సీ టాస్క్ లు ఉండవు.. ఆ పదాలు బ్యాన్.. కంటెస్టెంట్స్ కి వీకెండ్ షాక్ ఇచ్చిన నాగార్జున..

Bigg Boss 7 Day 76 Highlights Nagarjuna fires on Contestants

Bigg Boss 7 Day 76 : శుక్రవారం ఎపిసోడ్ లో ప్రియాంక కొత్త కెప్టెన్ గా ఎన్నికవడంతో ముగిసింది. ఇక శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున(Nagarjuna) వచ్చారు. శనివారం ఎపిసోడ్ లో వారం అంతా కంటెస్టెంట్స్ ఏం చేశారో చూపించి వాళ్లకి క్లాస్ పీకుతారని తెలిసిందే. ఈ వారం కూడా అదే చేశారు.

మొదట తన ఫేవరేట్ అయిన శివాజీ నుంచే మొదలుపెట్టాడు నాగార్జున. శివాజీ ఈ వారం కొన్ని బూతు పదాలని తెలివిగా పదాలు మార్చి ఉపయోగించాడు. ఈ విషయంలో శివాజీని హెచ్చరించాడు నాగ్. శివాజీ మాత్రం దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసాడు. దీంతో నాగ్ ఎప్పటిలాగే శివాజీ మీద ఫైర్ అవ్వకుండా జస్ట్ హెచ్చరించి వదిలేశాడు. ఇక అమర్ కెప్టెన్సీ టాస్క్ లో చేసిన తప్పులని గుర్తు చేయగా, కెప్టెన్ అవ్వడం కోసం చేసానని సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

మరోసారి రతికని.. నువ్వేం చెయ్యట్లేదు, ఎందుకు ఉన్నావు హౌస్ లో అంటూ ఫైర్ అయ్యాడు. రతిక రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి ఇదే పాయింట్ లో ఫైర్ అవుతున్నారు నాగ్. ఇక ప్రశాంత్ ని.. అందరూ నిన్ను పొగిడేసరికి రిలాక్స్ అయిపోయావు, గేమ్ ఆడట్లేదు అని ఫైర్ అయ్యాడు నాగ్. యావర్ విషయంలో ఏవిక్షన్ పాస్ దక్కించుకోవాలని తప్పుగా ఆడావు అని నాగ్ అనడంతో యావర్ ఏవిక్షన్ పాస్ ని రిటర్న్ ఇచ్చేశాడు. అశ్విని నామినేషన్స్ అప్పుడు బాటిల్ పగలగొడితే ఏదో దెబ్బ తగిలింది అన్నట్టు యాక్షన్ చేశావు అని ప్రశ్నించాడు.

ఈసారి హౌస్ లో కొన్ని పదాలు బ్యాన్ చేసానని నాగ్ చెప్పారు. ఇక నుంచి ఆడతాను, నేనేంటో చూపిస్తాను, జనాలు చూస్తున్నారు, పోట్రె చేస్తున్నారు.. లాంటి పదాలు కంటెస్టెంట్స్ ఎక్కువగా వాడుతుండటంతో వాటిని బ్యాన్ చేస్తున్నాను అని నాగ్ చెప్పారు. ఇకపై ఆ పదాలని ఉపయోగించరాదు అన్నారు. అనంతరం వచ్చే వారం మాత్రమే కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి కెప్టెన్సీ టాస్క్ ఇకపై ఉండదు అని కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చాడు నాగార్జున.

Also Read : Entertainment News : నేటి ఎంటర్టైన్మెంట్ విశేషాలు ఇవే.. బాలయ్యతో యానిమల్.. గుంటూరు కారం మూవీకి పవర్ స్టార్ వాయిస్!

మొత్తానికి శనివారం ఎపిసోడ్ లో అందరి మీద ఫైర్ అవుతూ, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించారు. ఇక నేడు ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ సరదాగా సాగనుంది. మరి ఆదివారం నాడు స్పెషల్ గెస్ట్ లు ఎవరు వస్తారో చూడాలి.