Bigg Boss 7 : మూడో వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరు.. ఈసారి పవర్ అస్త్ర..!
ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ లో ఉన్నది ఎవరు..? ఈసారి పవర్ అస్త్ర కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు..? గురువారం హౌస్ లో ఏం జరిగింది..?
- gum 95921
- Published On : September 22, 2023 / 07:10 AM IST
Bigg Boss 7 week 3 elimination nominations and power astra contenders
Bigg Boss 7 : బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7 మొదలై అప్పుడే రెండు వారలు పూర్తి చేసేసుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేశారు. ఇక ఇప్పుడు మూడో కంటెస్టెంట్ వెళ్లే సమయం వచ్చేసింది. మరి ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ లో ఉన్నది ఎవరు..? ఈసారి పవర్ అస్త్ర కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు..? గురువారం హౌస్ లో ఏం జరిగింది..?
Vijay Antony : విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్ నోట్ దొరికింది..
గత రెండు వారాల్లో పవర్ అస్త్రాన్ని సందీప్, శివాజీ సాధించి హౌజ్ మెంబర్స్ గా అయ్యారు. ఇక ఈ వారం ఆ అస్త్రాన్ని ఎవరు సాధిస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ పవర్ అస్త్ర కోసం కంటెండర్ గా ఆల్రెడీ యావర్ రేస్ లో ఉన్నాడు. గురువారం ఇందుకోసం అమర్ దీప్, ప్రియాంక మధ్య పోటీ. అలాగే శోభా శెట్టి, శుభ శ్రీ, పల్లవి ప్రశాంత్, గౌతం కృష్ణ మధ్య పోటీ నిర్వహించాడు బిగ్ బాస్. అమర్, ప్రియాంకలకు జుట్టు కత్తిరిన్చుకోవాలనే ఛాలెంజ్ ని ఇవ్వగా.. అమర్ ఛాలెంజ్ ని ఒప్పుకోలేదు.
Salaar : ప్రభాస్ అభిమానులకు గట్టి షాక్.. 2023లో సలార్ రావడం లేదట..
ప్రియాంక అంగీకరించి తన భుజాలు వరకు జుట్టు కత్తిరించుకొని కంటెండర్ గా నిలిచింది. ఇక శోభా శెట్టికి.. ఎక్కువ కారం ఉన్న చికెన్ పీస్ లు తినాలని ఛాలెంజ్ ని ఇచ్చారు. ఈ పోటీలో ఆమె 27 పీస్ లు తిన్నది. ఇక తనతో పాటు పోటీ పడిన శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ ఓడిపోయారు. దీంతో పవర్ అస్త్ర కోసం ఫైనల్ కంటెండర్స్ గా శోభా శెట్టి, ప్రియాంక, యావర్ పోటీలో నిలిచారు. మరి చివరికి ఈ అస్త్రాన్ని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.
ఇక ఈ వారం నామినేషన్స్ కూడా జరిగాయి. రతిక, దామిని, శుభ శ్రీ, ప్రియాంక, పిన్స్ యావర్, గౌతంకృష్ణ, అమర్ దీప్ నామినేట్ అయ్యి ఎలిమినేషన్ కి ఉన్నారు. మరి వీరిలో ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినతె అవుతారు అన్నది చూడాలి. నెటిజెన్స్ గౌతంకృష్ణ, దామిన అయ్యే ఛాన్స్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
