Bigg Boss 8 Day 50 Promo 1 Nomination Unmasked Friendship
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఏడు వారాలు పూర్తి అయ్యాయి. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనిమిదో వారం ప్రారంభమైంది. సోమవారం నామినేషన్స్ ఉంటుందనే విషయం తెలిసిందే. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. నామినేట్ చేయాలనుకునే వాళ్ల పేరు చెప్పి వారి ఎదుట ఉన్న దిష్టి బొమ్మపై కుండను పెట్టి బద్దలు కొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు.
మణికంఠ విషయంలో మెహబూబ్ కు పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సింది అంటూ నిఖిల్‌ను విష్ణు ప్రియ నామినేట్ చేసింది. ఆ తరువాత ప్రేరణను నామినేట్ చేసింది. చెప్పిన రూల్స్ నువ్వు ఏ మాత్రం వినవు. చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు అని నాకు అనిపిస్తోందని చెబుతూ పృథ్వీని రోహిణి నామినేట్ చేసింది. నా అపోజిట్‌లో ఉన్న మీ రూల్స్, రెగ్యులేషన్స్ నేనెందుకు ఫాలో అవ్వాలని పృథ్వీ అన్నాడు. ఇచ్చిన కేబుల్‌ను మడతపెట్టి జేబులో పెట్టుకుంటే గేమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని రోహిణి అంది.
Naveen Chandra : ‘గేమ్ ఛేంజర్’ పై ఇప్పుడున్నది అసలు హైపే కాదు.. నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక రోహిణిని పృథ్వీ రివర్స్ నామినేట్ చేశాడు. మీరు ఆటలో నాకు జీరో అని అనిపిస్తున్నారు అని పృథ్వీ చెప్పాడు. ఆటలో ఎఫర్ట్ పెట్టడం లేదా అని రోహిణి అడుగగా.. ఎఫర్ట్ పెడుతున్నారు అని పృథ్వీ అన్నారు. మరి ఇంకెం పెట్టాలి. నువ్వు ఒక్కసారి అయినా చీఫ్ అయ్యావా పోని అని రోహిణి అంది. ఇందుకు పృథ్వీ లేదు అని సమాధానం చెప్పాడు.
నీ దగ్గర ఆడే మ్యాటరు, మాట్లాడే మ్యాటరు ఏముండదు. ఏదో ఒకటి వాదించాలి.. నామినేట్ చేయాలి అని రోహిణి అంది. రన్నింగ్ కూడా రావాలి కదా అని పృథ్వీ అనగా.. రావాలి.. వస్తుంది.. అని రోహిణి అంది. అంత ఈజీ కాదు అంటూ రోహిణిని పై నుంచి కిందకు పృథ్వీ చూసినట్లుగా అనిపించింది. ఏంటది.. ఆ చూపేంటీ.. నువ్ నన్ను చూసిన విధానం దట్ ఈజ్ నాట్ రైట్ అని రోహిణి గట్టిగా అరిచింది. మొత్తంగా నామినేషన్స్ హాట్ హాట్‌గా జరిగినట్లుగా కనిపిస్తోంది.