Bigg Boss Contestant Rathika Rose breakup with Singer Rahul Sipligunj news goes viral
Rathika Rose Rahul Sipligunj : ఈ సారి బిగ్‌బాస్(Bigg Boss) కంటెస్టెంట్స్ లో రతిక రోజ్ అనే నటి కూడా వచ్చింది. రతిక పలు షార్ట్ ఫిలిమ్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్న వేల మరింత గుర్తింపు తెచ్చుకోడానికి బిగ్‌బాస్ కి వచ్చింది రతిక. అయితే రతిక సింగర్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ కి మాజీ ప్రియురాలు అని ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.
రతిక గతంలో 2019లోనే రాహుల్ సిప్లిగంజ్ తో ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసింది. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మరిందని సమాచారం. అయితే రాహుల్ బిగ్‌బాస్ సీజన్ 3 లో పాల్గొన్నప్పుడు పునర్నవితో క్లోజ్ గా ఉండటం, బయటకి వచ్చాక కూడా వారు రిలేషన్ లో ఉన్నారు అని టాక్ రావడంతో రతిక – రాహుల్ మధ్య విబేధాలు వచ్చి విడిపోయారని టాక్ నడుస్తుంది.
షోలోకి రతిక ఎంట్రీ ఇచ్చినప్పుడే నాగార్జున బ్రేకప్ నుంచి బయటకి వచ్చావా అని అడిగితే మొత్తం మీరే చేశారు అని వాళ్ళ పేర్లు తీసుకురాకుండా రాహుల్ పునర్నవిలను కలిపిన బిగ్‌బాస్ గురించి గుర్తుచేసింది. హౌస్ లోకి వెళ్ళాక కూడా బ్రేకప్ గురించి అడిగితే చెప్పలేదు. నీ హార్ట్ బ్రేక్ చేసిన వాళ్ళని ఇమిటేట్ చేయమని అడిగితే ఇప్పుడు పాట పాడాలా అని ఇండైరెక్ట్ గా రాహుల్ గురించి చెప్పింది. దీంతో రతిక – రాహుల్ బ్రేకప్ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అలాగే గతంలో వీరిద్దరూ క్లోజ్ గా అడిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి రాహుల్ దీనిపైనా ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
ఇక ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7లో అయితే రతిక హౌస్ లో ఇంకో కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ తో ప్రేమాయణం నడుపుతుంది. మరి ఇది ఎంతవరకు ఉంటుందో చూడాలి.