×
Ad

Sri Satya : హీరోయిన్ గా సినిమా.. పాపం 33 రోజులు ఎండలో పనిచేశాక..

శ్రీ సత్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. (Sri Satya)

Sri Satya

Sri Satya : సీరియల్స్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది శ్రీ సత్య. అంతకుముందే మిస్ విజయవాడగా లోకల్ లో పాపులారిటీ తెచ్చుకుంది. శ్రీ సత్య బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పాల్గొని మరింత వైరల్ అయింది. బిగ్ బాస్ తర్వాత శ్రీ సత్య యూట్యూబ్ లో సిరీస్ లు, సాంగ్స్, సీరియల్స్, సోషల్ మీడియాలో పోస్టులతో బిజీగానే ఉంది.(Sri Satya)

తాజాగా శ్రీ సత్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తాను హీరోయిన్ గా ఒక సినిమా కూడా చేసానని తెలిపింది.

Also Read : Rithu Chowdary : ఒక్క ఆర్టిస్ట్ కూడా సపోర్ట్ చేయలేదు.. నా క్యారెక్టర్ బ్యాడ్ చేసారు.. బాత్రూంలో కూర్చొని ఏడ్చాను..

శ్రీ సత్య మాట్లాడుతూ.. మిస్ విజయవాడ అయ్యాక టీవీలో ట్రై చేద్దామని వచ్చాను. అలా ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నప్పుడే హీరోయిన్ గా సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా కోసం 33 రోజులు ఎండలో గోదావరిలో పనిచేశాను. నాకు అదే ఫస్ట్ సినిమా. యాక్టింగ్ చాలా కష్టంగా ఉండేది. ఆ సినిమా డైరెక్టర్ నాకు అన్ని నేర్పించాడు. చాలా కష్టంగా అనిపించేది. యాక్టింగ్, సినిమా వద్దు వెళ్ళిపోదాం అని మా అమ్మతో అనేదాన్ని. కానీ ఆ సినిమా డైరెక్టర్ – నిర్మాత గొడవ పడి సినిమా ఆగిపోయింది. అలా హీరోయిన్ గా చేసిన సినిమా బయటకు రాలేదు అని తెలిపింది.

Also See : Ashika Ranganath : భర్త మహాశయులకు విజ్ఞప్తి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఆషికా.. రవితేజతో క్యూట్ ఫోటోలు..