Rithu Chowdary : ఒక్క ఆర్టిస్ట్ కూడా సపోర్ట్ చేయలేదు.. నా క్యారెక్టర్ బ్యాడ్ చేసారు.. బాత్రూంలో కూర్చొని ఏడ్చాను..
రీతూ చౌదరి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనని బయట నెగిటివ్ చేసారని చెప్తూ ఎమోషనల్ అయింది. (Rithu Chowdary)
Rithu Chowdary
- రీతూ చౌదరి ఇంటర్వ్యూ
- బిగ్ బాస్ నెగిటివిటిపై కామెంట్స్
- తల్లి బాధ గురించి చెప్తూ ఎమోషనల్
Rithu Chowdary : సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న రీతూ చౌదరి ఆ తర్వాత టీవీ షోలతో మరింత వైరల్ అయింది. ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొని ఆల్మోస్ట్ చివరి వరకు ఉండి 90 రోజుల తర్వాత బయటకు వచ్ఛేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక రీతూ చౌదరి ప్రస్తుతం BB జోడి డ్యాన్స్ షోతో పాటు పలు టీవీ షోలు చేస్తుంది. అలాగే బయట యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తుంది.(Rithu Chowdary)
తాజాగా రీతూ చౌదరి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనని బయట నెగిటివ్ చేసారని చెప్తూ ఎమోషనల్ అయింది. రీతూ చౌదరి తండ్రి రెండేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయింది.
రీతూ చౌదరి మాట్లాడుతూ.. నేను, మా అమ్మ, మా అన్నయ్య అంతే ముగ్గురమే ఉంటాం. బాధ అయినా సంతోషం అయినా మా ముగ్గురి మధ్యే. మా నాన్న వెళ్ళిపోయాక చాలా బాధపడ్డాం. మాకు చుట్టాలు కూడా ఎక్కువ లేరు. నేను ఇల్లు కొన్నాక మా ఇంటికి అసలు ఓ పదిమంది కూడా రాలేదు మా చుట్టాలు. మా అమ్మ బాధలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోడానికి ఎవరూ ఉండరు. బిగ్ బాస్ లో నా గురించి మా అమ్మ చాలా ఫీల్ అయింది. నా గురించి బయట నెగిటివ్ చేసారు. నేను బయటకు వచ్చేస్తే బాగుండు అనుకుంది మా అమ్మ.
చాలా మంది ఆర్టిస్టులకు మా అమ్మ ఫోన్ చేసి ఓటింగ్ గురించి వీడియో చేయమని అంటే చేయలేదు. చేయమన్నారు. ఆర్టిస్టులు చాలా మంది నాకు సపోర్ట్ చేయలేదు. నా క్యారెక్టర్ నెగిటివ్, బ్యాడ్ అని అన్నారు. ఆ విషయంలో మా అమ్మ చాలా బాధపడింది. బిగ్ బాస్ నుంచి అందరూ బయటకు వచ్చాక వాళ్లకు ఫోన్ కాల్స్ వస్తే మాకు మాత్రం ఎవరూ లేరు మాట్లాడటానికి. మా అమ్మ ఇవన్నీ చూసి బాధపడితే నేను మా అమ్మని ఓదార్చి నేను వెళ్లి బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. మా చుట్టాలు కొంతమంది మాకు ఇలాగే జరగాలి, వీళ్ళకి బాగా జరిగింది అని నెగిటివ్ గా కామెంట్స్ చేసారు అని చెప్తూ ఎమోషనల్ అయింది.
