Bhanu Sri : ఇరవై లక్షలు ఇచ్చి మోసపోయా.. అసలు డబ్బులే ఇవ్వలేదు ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు.. ఇల్లు కోసం దాచుకున్న డబ్బులు..
భానుశ్రీ తనని ఒకరు డబ్బు విషయంలో మోసం చేసారని మాట్లాడుతూ..

Bigg Boss Fame Bhanu Sri said Someone Fraud her for 20 Lakhs
Bhanu Sri : భానుశ్రీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉంది. రెగ్యులర్ గా విదేశాలకు వెళ్తూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా భానుశ్రీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ లోని పలు ఆసక్తికర అంశాలను తెలిపింది.
Also Read : Rajamouli : రాజమౌళి ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? ఏ పనికి తీసుకున్నారంటే..
భానుశ్రీ తనని ఒకరు డబ్బు విషయంలో మోసం చేసారని మాట్లాడుతూ.. తెలిసిన వాళ్లలోనే ఒకరికి ఇరవై లక్షలు ఇచ్చాను. వడ్డీలాగానే ఇచ్చా. నెల నెలా కొంత వడ్డీ ఇచ్చేవాళ్ళు. కొన్ని నెలలు బాగానే ఇచ్చారు. తర్వాత వాళ్ళు డబ్బులు అడిగితే రేపు మాపు అని తిప్పారు. అవి నేను హైదరాబాద్ లో ఇల్లు కొందామని దాచుకున్న డబ్బులు. నేను ఇల్లు కొందామని డబ్బులు అడిగితే ఇవ్వలేము, ఇవ్వము అన్నారు. నేనేమో వాళ్లకు క్యాష్ రూపంలో ఇస్తే వాళ్ళు వడ్డీ అకౌంట్ లో వేసేవాళ్ళు. నేను డబ్బులు అడిగితే షేర్ మార్కెట్ లో పెట్టాం పోయాయి, ఇవ్వలేము అని చెప్పారు. మీరు పెడితే పోగొడితే నాకెందుకు నా డబ్బులు నాకు కావాలి అంటే నువ్వు ఎప్పుడు డబ్బులు ఇచ్చావు? ప్రూఫ్ ఏంటి అని అడిగారు. నేను షాక్ అయ్యాను. ఇది బిగ్ బాస్ కి ముందు జరిగింది. 20 లక్షలు అప్పట్లో పెద్ద అమౌంట్. కానీ నేను తర్వాత అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించా. వాళ్ళు మాత్రం రోడ్డు మీద పడ్డారు. ఇప్పటికి ఆ డబ్బులు ఇవ్వలేదు అంటూ తెలిపింది.
Also See : Janhvi Kapoor : బెడ్ పై జాన్వీ కపూర్ అందాల వల.. ఫొటోలు..