×
Ad

Hariteja : నాకు కరోనా ఉన్నప్పుడు బేబీ పుట్టింది.. బేబీ పుట్టాక నాకు ఇవ్వలేదు.. హరితేజ ఎమోషనల్..

హరితేజ కరోనా సమయంలో తన డెలివరీ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. (Hariteja)

Hariteja

Hariteja : కరోనా సమయంలో చాలామంది కష్టాలు పడిన సంగతి తెలిసిందే. తాజాగా నటి హరితేజ కరోనా సమయంలో తాను ప్రగ్నెంట్ అని, కరోనాలోనే తన పాప పుట్టిందని ఆ సంఘటన గురించి చెప్తూ ఎమోషల్ అయింది.

హరితేజ మాట్లాడుతూ.. కరోనా లాక్ డౌన్ సమయంలోనే నేను ప్రగ్నెంట్ అయ్యాను. డెలివరీ సమయానికి నాకు కూడా కరోనా వచ్చింది. నాకు కరోనా ఉన్నప్పుడే బేబీ పుట్టింది. తను పుట్టడం చాలా కష్టం అయింది. తనని జాగ్రత్తగా పుట్టించమని దేవుడ్ని కోరుకుంటూనే ఉన్నాను. ఆ సమయంలో నాతో పాటు ఇంట్లో అందరికి కరోనా వచ్చింది. నాకు కరోనా ఉండటంతో పాప పుట్టాక నాకు ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ తీసుకున్నారు. తను పుట్టడమే ఫైట్ చేస్తూ పుట్టింది. ఇప్పుడు పాప చాలా బాగుంది, చాలా ఫాస్ట్ కూడా అని చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Hariteja : పెళ్లి చూపులకు బీచ్ లో నిక్కర్ తో ఉన్న ఫోటో పంపించి.. సంబంధం క్యాన్సిల్ అయ్యాక ప్రేమించుకొని.. వీళ్ళ లవ్ స్టోరీ భలే ఉందే..

హరితేజ కూతురు పేరు భూమి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన కూతురుతో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది హరితేజ.