Hariteja : పెళ్లి చూపులకు బీచ్ లో నిక్కర్ తో ఉన్న ఫోటో పంపించి.. సంబంధం క్యాన్సిల్ అయ్యాక ప్రేమించుకొని.. వీళ్ళ లవ్ స్టోరీ భలే ఉందే..
తాజాగా హరితేజ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయం తెలిపింది.(Hariteja)

Hariteja
Hariteja : నటి హరితేజ సీరియల్స్, బిగ్ బాస్ తో అందరికి పరిచయమే. ఇప్పుడు సినిమాల్లో ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. హరితేజ భర్త దీపక్, కూతురు భూమితో ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా గడుపుతుంది. తాజాగా హరితేజ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయం తెలిపింది.(Hariteja)
హరితేజ తన ప్రేమ – పెళ్లి గురించి మాట్లాడుతూ.. మాది మొదట అరేంజ్ చేస్తే తర్వాత అది లవ్ మ్యారేజ్ అయింది. నాకు సంబంధాలు చూస్తున్నప్పుడు పెళ్లి చూపుల ఫోటోలు వచ్చేవి. అలా దీపక్ ఫోటో వచ్చింది. బీచ్ లో నిక్కర్, బనీన్ వేసుకొని జబ్బలకు టాటూ ఉన్న ఫోటోని పెళ్లి చూపులకు పంపించారు. ఎవడైనా ఇలాంటి ఫోటోని పెళ్లి చూపులకు పంపిస్తారా? ఇలాంటి అబ్బాయి వద్దు, సాంప్రదాయంగా ఉండాలి అన్నాను. దాంతో పేరెంట్స్ ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేసారు. ఈ విషయం నాకు తెలియదు.
Also Read : NTR : దేవర సినిమాలో ఈ నటిని ఎందుకు పెట్టుకున్నారు.. యాక్టింగ్ రాదు అంటూ కొరటాల శివని ప్రశ్నించిన ఎన్టీఆర్..
అతను మాత్రం నన్ను వదల్లేదు. నన్ను కలిసి మాట్లాడాడు. నేను ఆ బట్టలు మాత్రమే వేసుకొను, సాంప్రదాయంగా కూడా ఉంటాను అని మాట్లాడి, కలిసి, తిరిగి కొంచెం దగ్గర అయ్యాము. నేను కూడా ముందే జడ్జ్ చేసేసాను అనిపించింది. అరేంజ్ గా మొదలయి తర్వాత లవ్ చేసుకున్నాము. మా పేరెంట్స్ మొదట వద్దనుకోవడంతో ఈ సంబంధం క్యాన్సిల్ చేసేసారు. కానీ మేము కలుస్తున్నాము, తిరుగుతున్నాము, ప్రేమించుకున్నాము అని వాళ్లకు తెలియదు. రెండేళ్ల తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం అంటే వద్దు సంబంధం క్యాన్సిల్ అయింది కదా అన్నారు. కానీ జరిగిందంతా చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాము అని తెలిపింది. దీంతో ఈ లవ్ స్టోరీ ఏదో భలే ఉందే అనుకుంటున్నారు.
Also Read : Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ అంటే హరితేజకు ఎంత ఇష్టమో.. బన్నీ కోసం ఏకంగా 15 రోజులు ఏం చేసిందో తెలుసా?