Bigg Boss fame serial artist maanas engaged with Srija getting marriage will soon
Maanas Engagement : సీరియల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న మానస్ బిగ్‌బాస్(Bigg Boss) 5లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాలలో కూడా మానస్ నటించాడు. ప్రస్తుతం మానస్ పలు సీరియల్స్, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. బిగ్‌బాస్ తర్వాత మానస్ లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
తాజాగా మానస్ అందరికి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మానస్ నిన్న శనివారం సెప్టెంబర్ 2 సాయంత్రం నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. శ్రీజ అనే అమ్మాయితో మానస్ ఎంగేజ్మెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది.
మానస్ ఎంగేజ్మెంట్ కి పలువురు టీవీ, సినీ ఆర్టిస్టులు హాజరయ్యారు. దీంతో మానస్ శ్రీజ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మానస్ కూడా అధికారికంగా నిశ్చితార్థం జరిగినట్టుయి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పలువురు టీవీ ప్రముఖులు, అభిమానులు మానస్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక వీరిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిందా అనేది ఇంకా తెలియలేదు. మానస్ చేసుకోబోయే అమ్మాయి శ్రీజ గురించి ఈ అమ్మాయి ఎవరా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఇక వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని సమాచారం.