Bigg Boss fame Vasanthi Krishnan married Pawan Kalyan Wedding Photos goes Viral
Vasanthi Krishnan : సీరియల్ నటి వాసంతి కృష్ణన్ కన్నడ, తెలుగులో పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్(Bigg Boss) 6వ సీజన్ లో పాల్గొని బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ తర్వాత సిరీస్ లు, సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకుంటుంది. గత కొన్నేళ్లుగా వాసంతి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అనే నటుడితో ప్రేమలో ఉంది. గత సంవత్సరం డిసెంబర్ లో వాసంతి, పవన్ ల నిశ్చితార్థం జరిగింది.
Also Read : Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫొటోలు చూశారా?
తాజాగా వాసంతి కృష్ణన్ – పవన్ కళ్యాణ్ వివాహం ఘనంగా తిరుపతిలో జరిగింది. వీరి పెళ్ళికి బంధుమిత్రులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇక వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లి అనంతరం ఈ కొత్త జంట పెళ్లి బట్టలతోనే తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ జంటకి అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.