Bigg Boss 5 : బరాబర్ కప్పు గెలుస్తా.. మా అమ్మకి ఇస్తా..

ఇక ముందు నుంచి టీంగా ఆడుతున్న మానస్, కాజల్, సన్నీలలో కాజల్ వెళ్లిపోవడంతో మానస్, సన్నీలు ఒకటిగా ఉంటూ మాట్లాడుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో మానస్‌- సన్నీ బిగ్ బాస్ కప్పు .....

Sunny

Bigg Boss 5 :  బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ఆఖరి దశలో ఉంది. చివరి వారం కావడంతో మరింత ఆసక్తితో ప్రేక్షకులు ఈ షోని చూస్తున్నారు. ఇప్పటికే టాప్ 5గా షన్ను, సిరి, శ్రీరామ్, సన్నీ, మానస్ లు మిగిలారు. ఇక చివరి వారం కావడంతో గడిచిన వారాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు కంటెస్టెంట్స్. ఈ నేపథ్యంలో అందరూ ఎలాగైనా కప్పు గెలవాలని కోరుకుంటున్నారు.

Samantha : సమంతపై వచ్చే పుకార్లను నమ్మొద్దు : సమంత మేనేజర్

ఇక ముందు నుంచి టీంగా ఆడుతున్న మానస్, కాజల్, సన్నీలలో కాజల్ వెళ్లిపోవడంతో మానస్, సన్నీలు ఒకటిగా ఉంటూ మాట్లాడుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో మానస్‌- సన్నీ బిగ్ బాస్ కప్పు గురించి మాట్లాడుకున్నారు. సన్నీ మాట్లాడుతూ.. ‘టెన్షన్‌గా ఉంది, ఎలాగైనా టైటిల్‌ గెలవాలి, మా అమ్మకు కప్‌ ఇస్తరా బయ్‌. ఇది ఫిక్స్‌. ఏదైనా కానీ బరాబర్‌ కప్పు ఇస్తా’ అంటూ కప్ గెలవడం గురించి మాట్లాడాడు. మానస్ ఈ విషయంలో ఏమి మాట్లాడలేదు. దీని బట్టి మానస్ కూడా కప్పు మీద ఆశలు వదిలేసుకొని సన్నీకి హెల్ప్ చేసే ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తుంది.