Bigg Boss 9 Telugu: సంజనకు బిగ్ బాస్ స్పెషల్ పవర్.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ.. కెప్టెన్సీ భాద్యత ఆమె చేతిలోనా?

బిగ్ బాస్ ఆట అనేది ఎప్పుడు ఎటు టర్న్ అవుతుందో ఎవరు చెప్పలేరు. అలాగే(Bigg Boss 9 Telugu).. ఎవరు, ఎప్పుడు, ఎలా తమ గేమ్ ను మార్చుకుంటారో కూడా అర్థం కాదు.

Bigg Boss 9 Telugu: సంజనకు బిగ్ బాస్ స్పెషల్ పవర్.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ.. కెప్టెన్సీ భాద్యత ఆమె చేతిలోనా?

Bigg Boss gives special power to Sanjana Galrani

Updated On : September 12, 2025 / 10:10 AM IST

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఆట అనేది ఎప్పుడు ఎటు టర్న్ అవుతుందో ఎవరు చెప్పలేరు. అలాగే.. ఎవరు, ఎప్పుడు, ఎలా తమ గేమ్ ను మార్చుకుంటారో కూడా అర్థం కాదు. అప్పుడప్పుడు బిగ్ బాస్ కూడా ఆడియన్స్ కి షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే,. ఆడియన్స్ ని అలరించే భాద్యత ఆయనదే కదా. అదే రేంజ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కూడా ముందుకు సాగుతోంది. ఈ బిగ్ బాస్ 9 మొదలైనప్పటి నుండి సంజన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె ఆట ఇంట్లో ఎవరికీ నచ్చడం లేదు. ఆమె మాట తీరు, ప్రవర్తన అసలు ఒక్క విషయంలో కూడా కంటెస్టెంట్స్ సంతృప్తి గా లేదు. నీ ఒక్కదానివల్ల అందరం(Bigg Boss 9 Telugu) సఫర్ అవుతున్నాం అంటూ ఆమెను టార్గెట్ చేశారు, చేస్తున్నారు కూడా.

Aditya 999: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. దసరాకి ఆదిత్య 999 షురూ?

కానీ, ఆమె మాత్రం అవేవి పట్టనట్టుగా తన ఆట తాను ఆడుకుంటూపోతోంది. ఆమె బిహేవియర్ చూసిన చాలా మంది ఆడియన్స్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెను అవుతుంది అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. ఆడియన్స్ లో చాలా మంది ఆమె ఆటకు ఫెవర్ గా ఉన్నారు. ఓటింగ్ కూడా బాగానే పడుతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఆమెకు ఏకంగా ఒక సూపర్ పవర్ అందించాలరు. ఈ ఇంటికి ఫస్ట్ క్యాప్టెన్ ను నిర్ణయించే అధికారాన్ని ఆమెకు అయిందించారు. సంజనను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ ఇంట్లో అందరు ఎలా ఆన్నారు, మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుందా అని అడిగాడు.

దానికి సమాధానంగా సంజన మాట్లాడుతూ.. అవును అలానే అనిపించింది. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. లోపల ఒకలా బయటికి ఒకలా ఉంటూ నటిస్తున్నారు అంటూ చెప్పింది. తన మాటలకు ఇంప్రెస్ అయినా బాగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ఎవరు బరిలో ఉంటే బాగుటుంది ఒక నలుగురి పేరు చెప్పు అని అడిగాడు. దానికి సంజన.. హరీష్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్, శ్రష్టి పేర్లు చెప్పింది. అదే పేర్లను బయటికి వెళ్లి చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. బయటకు వచ్చిన సంజన ఆ ఐదుగురి పేర్లు చెప్పింది. దాంతో మా పేర్లు ఎందుకు చెప్పలేదు అంటూ మొగత కంటెస్టెంట్స్ గొడవ చేయడం మొదలు పెట్టరు. కానీ, నాకు క్లోజ్ అయినవారిని పేర్లను సెలక్ట్ చేశానంటూ స్ట్రాంగ్ గా చెప్పేసింది సంజన. మరి మొదటివారం కెప్టెన్ ఎవరు అవతారనేది చూడాలి.