Bigg Boss Lobo : బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లోబో

తాజాగా లోబో ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవితో ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ.. నా కల నిజమైంది. చిరంజీవి సార్‌ సినిమాలో ఆఫర్‌ వచ్చింది అంటూ......

Lobo

Bigg Boss Lobo :  ఒక‌ప్పుడు టీవీ షోలు, ఈవెంట్లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన లోబో ఇటీవల బిగ్‌బాస్‌ ఆఫ‌ర్ రావడంతో ఈ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చాడు. త‌న కామెడీతో హౌస్ లో ఎంట‌ర్‌టైన్ చేశాడు. కొన్ని రోజులు సీక్రెట్ రూంలో కూడా ఉన్నాడు. బిగ్ బాస్ లో రవి సపోర్ట్ తో గేమ్ ఆడినా మధ్యలోనే ఎలిమినేట్ అయి వచ్చేశాడు. ఇక అందరి కంటెస్టెంట్స్ లాగే లోబోకి కూడా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.

Shannu – Siri : సిరి-షణ్నులపై ఫైర్ అయిన మాధవీలత..

తాజాగా లోబో ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. లోబో తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవితో ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ.. నా కల నిజమైంది. చిరంజీవి సార్‌ సినిమాలో ఆఫర్‌ వచ్చింది అంటూ పోస్ట్ చేశాడు. ఇటీవల ఓ టీవీ షోలో కూడా తనకి చిరంజీవి సినిమా ఆఫర్‌ వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు లోబో. ఎక్కువ నిడివి ఉన్న పాత్ర వచ్చిందని తెలిపాడు. ఈ ఆఫర్ ‘భోళాశంకర్’ సినిమాలో వచ్చిందని కూడా చెప్పాడు. మొత్తానికి బిగ్ బాస్ తనకి బాగా ప్లస్ అయిందని, కెరీర్ సెట్ అవ్వడానికి ఉపయోగపడినట్లే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.