Virgin Boys
Virgin Boys : రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వర్జిన్ బాయ్స్. మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 11వ తేదీన రిలీజ్ కానుంది. నేడు వర్జిన్ బాయ్స్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.
మీరు కూడా వర్జిన్ బాయ్స్ ట్రైలర్ చూసేయండి..
అయితే ఈ ఈవెంట్లో నిర్మాతలు స్పెషల్ ఆఫర్స్ అనౌన్స్ చేసారు. ఈ సినిమాకు వస్తే సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల మీద సడెన్ గా డబ్బు కురవచ్చు, ఎవరైనా అదృష్టవంతులు డబ్బులు గెలుచుకోవచ్చు అని చెప్పారు. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న వారికి లక్కీ డ్రా తీసి 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని కూడా ప్రకటించారు. జులై 11 సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల వరకు ఈ ఆఫర్ ఉంటుందని, ఈ ఆఫర్ కి సంబంధించి మరిన్ని వివరాలు వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
Also Read : Allu Arjun : అమెరికాలో అడుగు పెట్టిన అల్లు అర్జున్.. లుక్ అదిరిందిగా.. ఫొటోలు వైరల్..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమా నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ… వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ ఖచ్చితంగా సూట్ అవుతుంది ఈ సినిమాకు. ఈ సినిమాలో పెద్దవారు ఎవరూ లేరు. ఎన్నో సర్ప్రైజ్ లతో ఈ సినిమా జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము అని తెలిపారు. డైరెక్టర్ దయానంద మాట్లాడుతూ… మేము కాలేజీ రోజుల్లో ఉండగా చేసిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తీస్తున్నాము. గీతానంద్, మిత్ర శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చాయి అని తెలిపారు.
నటుడు గీతానంద్ మాట్లాడుతూ… మిత్ర శర్మ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. తన రోల్ సాధారణమైనది కాదు. అటువంటి రోల్ చేయాలంటే ఎంతో మెచ్యూరిటీ ఉండాలి. ఈ సినిమా యూత్ కు బయోపిక్ లాంటిది. నిజమైన సంతోషం మందు, మత్తు పదార్థాలలో ఉండదు. మనం ఏదైనా సాధించినప్పుడు వస్తుంది. ఈ సినిమా చూశాక ఎంతో సంతృప్తితో బయటకు వెళ్తారు అని అన్నారు. నటి మిత్ర శర్మ మాట్లాడుతూ… ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. మా నిర్మాత రాజా గారు ఎంతో సహనం గలవారు. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. మేము చేసిన కొన్ని మంచి పనులను చూసి ఆయన గొప్పగా చెప్పుకుని మురిసిపోతూ ఉంటారు అని తెలిపారు.