Raja Ravindra : మెస్‌లో భోజనం చేస్తుంటే తీసుకెళ్లి హీరోని చేసారు.. అది కూడా స్టార్ హీరోయిన్ పక్కన.. తీరా సినిమా అయ్యాక..

తాజాగా సీనియర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర ఆహా కాకమ్మ కథలు షోకి రాగా తన కెరీర్ ఎలా మొదలైందో తెలిపాడు.

Raja Ravindra : మెస్‌లో భోజనం చేస్తుంటే తీసుకెళ్లి హీరోని చేసారు.. అది కూడా స్టార్ హీరోయిన్ పక్కన.. తీరా సినిమా అయ్యాక..

Raja Ravindra

Updated On : July 5, 2025 / 6:44 PM IST

Raja Ravindra : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు రాజా రవీంద్ర. హీరోగా కూడా మధ్యలో కొన్ని సినిమాలు చేసారు. చాలామంది హీరో, హీరోయిన్స్ కి మేనేజర్ గా కూడా బిజీగా ఉంటారు రాజా రవీంద్ర. అయితే ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోగానే. అది కూడా స్టార్ హీరోయిన్ పక్కన. కానీ తీరా చూస్తే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు.

తాజాగా సీనియర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర ఆహా కాకమ్మ కథలు షోకి రాగా తన కెరీర్ ఎలా మొదలైందో తెలిపాడు.

Also Read : Naveen Chandra : ఆ అమ్మాయి వల్లే ఫస్ట్ టైం అమెరికాకు వెళ్ళాను.. అమెరికాలో చిరంజీవి మమ్మల్ని చూసి..

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. చెన్నై లో కూచిపూడి నేర్చుకుందామని వెళ్ళాను. ఒక రోజు మెస్ లో తింటుంటే ఒకరు వచ్చి హీరోగా చేస్తావా అని సినిమా ఆఫీస్ కి తీసుకెళ్లారు. అప్పుడు డైరెక్టర్ లేరు. పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను. నా అసలు పేరు రమేష్. నెక్స్ట్ డే వెళ్లి నేనే రమేష్ రమ్మన్నారు అని డైరెక్టర్ ని కలిసాను. ఆయన అప్పటికే కృష్ణ లాంటి స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసి ఉన్నారు. ఫస్ట్ సినిమానే హీరోయిన్ రేవతి పక్కన హీరోగా. రేవతి గారు అప్పటికే స్టార్ హీరోయిన్. ఆమె దగ్గరికి నన్ను తీసుకెళ్లి ఇతనే హీరో, మీకు ఓకేనా అని అడిగితే ఆవిడ ఓకే అన్నారు. సినిమా అయిపోయింది కానీ రిలీజ్ అవ్వలేదు. రాఘవేంద్రరావు గారు సినిమా చూసి ఆడదని అర్థమయి సైలెంట్ గా వెళ్లిపోయారు. రామానాయుడు గారికి సినిమా చూపించి రిలీజ్ చేయమని అడిగితే ఇది వర్కౌట్ అవ్వదు చేయను అన్నారు. కానీ ఆ అబ్బాయి బాగున్నాడు నా నెక్స్ట్ సినిమాలో వేషం ఇస్తాను అని సర్ప యాగం సినిమాలో వేషం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ వెనక్కి చూసుకోలేదు అని తెలిపారు.

Raja Ravindra

Also Read : Raja Ravindra : వచ్చి కార్ డోర్ తీసి అన్ని అందించేవాడు.. తర్వాత కనీసం మంచినీళ్లు అడిగినా ఇవ్వలేదు..