Naveen Chandra : ఆ అమ్మాయి వల్లే ఫస్ట్ టైం అమెరికాకు వెళ్ళాను.. అమెరికాలో చిరంజీవి మమ్మల్ని చూసి..

నవీన్ చంద్ర ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Naveen Chandra : ఆ అమ్మాయి వల్లే ఫస్ట్ టైం అమెరికాకు వెళ్ళాను.. అమెరికాలో చిరంజీవి మమ్మల్ని చూసి..

Naveen Chandra

Updated On : July 5, 2025 / 6:06 PM IST

Naveen Chandra : సినీ పరిశ్రమలో చాలామంది నటీనటులు, సాంకేతిక నిపుణులు మెగాస్టార్ చిరంజీవిని ప్రేరణగా తీసుకొని, ఆయన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళల్లో నవీన్ చంద్ర ఒకరు. నవీన్ చంద్ర ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

తాజగా నవీన్ చంద్ర ఆహా కాకమ్మ కథలు షోకి వచ్చాడు. ఈ షోని నటి తేజస్వి మడివాడ హోస్ట్ చేస్తుంది. ఈ షోలో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. తేజస్వి వల్లే నేని మొదటిసారి అమెరికాకు వెళ్ళాను. అక్కడ నేను – తేజస్వి కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. తేజస్వి కావాలని నన్ను సెలెక్ట్ చేసుకుంది. ఆ ఈవెంట్ కి చిరంజీవి గారు వచ్చారు. ఆ రోజు మేము వేసిన డ్యాన్స్ చూసి అక్కడే స్టేజి మీద చిరంజీవి గారు అభినందించారు. మొదటిసారి చిరంజీవి నుంచి అభినందనలు వచ్చింది అప్పుడే అని తెలిపారు.

Also Read : Raja Ravindra : వచ్చి కార్ డోర్ తీసి అన్ని అందించేవాడు.. తర్వాత కనీసం మంచినీళ్లు అడిగినా ఇవ్వలేదు..

వీరిద్దరూ కలిసి వేసిన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోని చూపించాడు నవీన్ చంద్ర. ఇక ఈ విషయంపై తేజస్వి మడివాడ మాట్లాడుతూ.. అప్పట్లో సోషల్ మీడియా కూడా అంతగా రాలేదు. అందుకే మేము కలిసి చేసిన డ్యాన్స్ ఎవ్వరికి తెలియదు. నవీన్ చంద్ర అయితేనే వెళ్తాను అని చెప్పాను. రఘు మాస్టర్ దగ్గర ఒక్క రోజులోనే డ్యాన్స్ నేర్చుకొని వెళ్ళాము. అమెరికాలో ఉదయం జిమ్ లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాము అని తెలిపింది.