Raja Ravindra : వచ్చి కార్ డోర్ తీసి అన్ని అందించేవాడు.. తర్వాత కనీసం మంచినీళ్లు అడిగినా ఇవ్వలేదు..
ఈ క్రమంలో తను ఫేస్ చేసిన ఓ సంఘటన గురించి తెలిపాడు.

Raja Ravindra
Raja Ravindra : సినీ పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే అందరూ పట్టించుకుంటారు. ఒక్కసారి ఫెయిల్యూర్స్ లోకి వెళ్తే ఎవరూ చూడరు కూడా అని అంతా చెప్తారు. సినీ పరిశ్రమలో సక్సెస్ అయిన అందరూ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చినవాళ్లే.
తాజాగా సీనియర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర ఆహా కాకమ్మ కథలు షోకి రాగా తన జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ క్రమంలో తను ఫేస్ చేసిన ఓ సంఘటన గురించి తెలిపాడు.
Also Read : Saif Alikhan : దేవర విలన్ కు 15 వేల కోట్ల ఆస్తి పోయినట్టేనా..? ఇంకో 800 కోట్ల ఆస్తి సేఫ్..
రాజా రవీంద్ర మాట్లాడుతూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మధ్యలో నైస్ రాజా అనే ఒక సినిమా హీరోగా చేశాను. అది రిలీజ్ అయితే హీరోగా అవకాశాలు వస్తాయేమో అని వెయిట్ చేశా కానీ రిలీజ్ అవ్వలేదు. దాంతో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. అప్పటికే పెళ్లి అయి పిల్లలు ఉన్నారు. అవకాశాల కోసం వేరే ఒక సినిమా షూటింగ్ దగ్గరికి డైరెక్టర్ ని ఛాన్స్ అడగడానికి వెళ్ళాను. నేను హీరోగా చేసిన నైస్ రాజా సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ చీఫ్ అక్కడ పనిచేస్తున్నాడు. అతను నేను హీరోగా చేసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి కార్ డోర్ తీయడం, బూస్ట్, జ్యుస్ ఇవ్వడం, అన్ని అందించడం, హీరోకి చేసే మర్యాదలు చేసేవాడు. అక్కడికి వెళ్ళాక చాలా సేపు నిల్చున్నా కనీసం కుర్చీ కూడా వేయలేదు. అతన్ని మంచి నీళ్లు తాగడానికి అడిగాను అతని మళ్ళీ నాకు కనపడకుండా వెళ్లిపోయాడు. ఇక డైరెక్టర్ నువ్ హీరోగా చేస్తున్నావు చిన్న వేషాలు ఇచ్చి నిన్ను తగ్గించాను అనడంతో వెళ్ళిపోయా. ఇక్కడ సక్సెస్ ఉంటేనే గుర్తింపు అని ఆ రోజు రియలైజ్ అయ్యాను అని తెలిపాడు.
Also Read : Pawan Kalyan : ఆయనే నాకు ఇంటర్ సీట్ ఇప్పించారు.. దివంగత ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..