Saif Alikhan : దేవర విలన్ కు 15 వేల కోట్ల ఆస్తి పోయినట్టేనా..? ఇంకో 800 కోట్ల ఆస్తి సేఫ్..
ఇప్పుడు 15000 కోట్ల ఆస్తులు చేజారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

Saif Alikhan
Saif Alikhan : మన దేశంలో రాజుల పాలన అంతమైనా రాజ కుటుంబీకులకు వారసత్వంగా కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు మాత్రం మిగిలాయి. బాలీవుడ్ స్టార్ హీరో, దేవర విలన్ సైఫ్ అలీఖాన్ కూడా పటౌడీ రాజ కుటుంబ వారసుడు. ఇతనికి రాజుల వారసత్వంగానే కోట్ల ఆస్తులు వచ్చాయి. అయితే ఇప్పుడు 15000 కోట్ల ఆస్తులు చేజారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
సైఫ్ కుటుంబానికి పటౌడీ రాజా సంస్థానం నుంచి హర్యానాలో 800 కోట్ల విలువ చేసే పటౌడీ ప్యాలెస్ వచ్చింది. అలాగే సైఫ్ నానమ్మ నుంచి భోపాల్ లో ఉన్న పలు భవనాలు కూడా వచ్చాయి. అయితే సైఫ్ నానమ్మ సాజిదా సుల్తాన్ భోపాల్ చివరి నవాబు కూతురు. దేశ విభజన సమయంలో వాళ్ళు పాకిస్థాన్ కి వెళ్లి స్థిరపడ్డార్టు. కానీ సైఫ్ నానమ్మ మాత్రం పటౌడీ నవాబుని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోయింది. దీంతో ఇక్కడ సాజిదా సుల్తాన్ చేతిలో ఉన్న ఆస్తులు వారసత్వంగా సైఫ్ కుటుంబానికి వచ్చేసాయి.
Also Read : Pawan Kalyan : ఆయనే నాకు ఇంటర్ సీట్ ఇప్పించారు.. దివంగత ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కానీ దేశ విభజన, పాకిస్థాన్ తో యుద్ధం తర్వాత ఇండియాలో ఉన్న పాకిస్థాన్ వాళ్ళ ఆస్తుల కోసం ప్రత్యేకంగా కస్టోడియన్ ఫర్ ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్ ని ఏర్పాటు చేసారు. సైఫ్ నానమ్మ తండ్రి, అతనికి సంబంధించిన వారంతా పాకిస్థాన్ వెళ్లిపోయారని, ఈ ఆస్తులు అన్ని వారివే అని, వాటిని విదేశీ పౌరుడి ఆస్తులుగా ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉంటుందని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015 లో ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ సైఫ్ కుటుంబం మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇన్నాళ్లు ఆ కేసు సాగగా తాజాగా సైఫ్ అలీఖాన్ కుటుంబం దాఖలు చేసిన పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. ఆ 15,000 కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని, ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఒకవేళ ట్రయిల్ కోర్టులో ఏడాది తర్వాత కూడా ఇదే తీర్పు వస్తే సైఫ్ కుటుంబానికి చెందిన 15000 కోట్ల ఆస్తులు చేజారినట్టే.