Bigg Boss Ott Telugu(1)
Bigg Boss Non Stop: మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ ముగింపు దశకి వచ్చేసింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్ బాస్ కు భారీ ఆధరణ దక్కగా.. ఈ నాన్ స్టాప్ ఓటీటీ బిగ్ బాస్ ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదని విమర్శలున్నా.. త్వరలో రెగ్యులర్ బిగ్ బాస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ ను ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వారంలో ఈ షోకు తెర వేయబోతున్నారు. ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా గత సీజన్ ల కంటెస్టెంట్స్ చివరి వారాలలో వచ్చి సందడి చేస్తున్నారు.
Bigg Boss: బిగ్ బాస్ ఆగిపోతుందా? నిర్వాహకులకు షాక్ తప్పదా?
మొత్తం మీద 70 రోజుల నుండి సాగిన ఈ షోలో ఈ ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్‌లు ఎవరో తేలిపోనున్నది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుది వారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు.. టైటిల్ రేసులోకి వెళ్ళేది ఎవరు.. టైటిల్ గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందా అని ప్రిడిక్షన్స్ కూడా మొదలయాయ్యి. అయితే.. ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న ఒకే ఒక్క కంటెస్టెంట్ ఎవరంటే మిత్రాశర్మ అని చెప్పుకుంటున్నారు వ్యూవర్స్.
Bigg Boss OTT Telugu: హౌస్ నిండా బోల్డ్ బ్యూటీస్.. బిగ్‌బాస్ ఏం స్కెచ్ వేశాడో?
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో సాధారణమైన కంటెస్టెంట్‌గా చేరిన మిత్రాశర్మ.. ఇప్పుడు అసాధారణ రీతిలో ఇంటి సభ్యులకు బలమైన ప్రత్యర్థిగా మారింది. రకరకాల టాస్కుల్లో తన ప్రతిభను చాటుతూ.. నామినేషన్లలో కంటెస్టెంట్లకు బలమైన ప్లేయర్‌గా పేరు తెచ్చుకుని.. ప్రత్యర్థుల ఆరోపణలకు ధీటుగా సమాధానమిస్తూ.. ఇతర కంటెస్టెంట్ల లోపాలను ఎత్తి చూపుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. అందుకే హోస్ట్ నాగార్జున, ఇంటికి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంది. అసలు రెండు మూడు వారాలు ఉండడమే ఎక్కువ అనుకున్న వాళ్లంతా ఇప్పుడు మిత్రా టాప్ 5 లో తప్పక ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ వారం ఇంటి నుండి బయటకొచ్చేది ఎవరో.. టాప్ 5కి వెళ్లేదెవరో చూడాలి.