Bigg boss season 9 grand finale updates
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరో తెలిసేందుకు ఇంకా ఒకరోజు మాత్రలు మిగిలి ఉంది. ఈ ఆదివారం గ్రాండ్ గా ఫినాలే ఈవెంట్ జరుగనుంది. ఈ ఫినాలే కోసం ఆడియన్స్ సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన, పవన్ ఈ ఐదుగురిలో ఎవరు ట్రోఫీ లిఫ్ట్ చేయనున్నారు అనేది ఉత్కంటగా మారింది. ఈనేపథ్యంలోనే శనివారం నాటి ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ తాజాగా (Bigg Boss 9 Telugu)పూర్తయ్యింది అని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో చాలా ట్విస్టులు జరిగాయట. ముందుగా శనివారం ఎపిసోడ్ లో ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ ని ఎలిమినెట్ చేశాడట నాగార్జున.
అందులో ముందుగా సంజన ఇంటినుంచి బయటకు వచ్చేసిందట. ఆ తరువాత టాప్ 3లో తప్పకుండ ఉంటాడన్న డెమోన్ పవన్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడట. దీంతో, ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారని సమాచారం. ఈ ఇద్దరి ఎలిమినేషన్ తో శనివారం నటి ఎపిసోడ్ ముగియనుందట. ఇక ఆదివారం జరిగే ఫైనల్ ఎపిసోడ్ లో కూడా చాలా ట్విస్టులు ఇవ్వనున్నాడట బిగ్ బాస్ అలాగే కంటెస్టెంట్స్ కూడా. అవును, ఈ సీజన్ ముందు నుంచి ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్.
ముందు నుంచి తన కామెడీతో ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చాడు. కానీ, ఏమయ్యిందో తెలియదు కానీ, అనూహ్యంగా అతని గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. విన్నర్ రేస్ నుంచి మెల్లిగా కిందకు పడుతూ వచ్చాడు. అయినప్పటికి ఎక్కడ పట్టువదలకుండా టాప్ 3 వరకు చేరుకున్నాడు. కానీ, రియాలిటీని గ్రహించిన ఇమ్మాన్యుయేల్ టాప్ 2 తనూజ, కళ్యాణ్ మధ్య ఉంటుందని గ్రహించి ఫైనల్ గా కాష్ బాక్స్ తీసుకొని బయటకు రానున్నాడట. ఇది నిజంగా షాకింగ్ డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఇంతకాలం ఇమ్మాన్యుయేల్ గెలవాలని ఓట్స్ వేసిన వారు తాను అలా చేయడాన్ని ఎలా తీసుకుంటారు అనేది చూడాలి.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్ కి వార్నింగ్.. కళ్యాణ్, తనూజ అభిమానులు జాగ్రత్త..
ఇక వోటింగ్ విషయంలో కూడా భారీ మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. గురువారం వరకు జరిగిన వోటింగ్ లో కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నట్టుగా చూపించింది. కానీ, శుక్రవారం మాత్రం సీన్ రివర్స్ అయ్యిందట. ఏ ఒక్కరోజే తనూజ కు భారీగా వోటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. దాంతో లిస్టులో రెండు ప్లేస్ లో ఉన్న ఆమె టాప్ లోకి చేరింది. అలాగే విన్నర్ కూడా ఆమెను అవుతుంది అంటూ కూడా తెలుస్తోంది. మరి ఇన్ని మలుపులు తిరుగుతున్న ఈ సీజన్ లో చివరికి విన్నర్ ఎవరు అవుతారు అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.