Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్ కి వార్నింగ్.. కళ్యాణ్, తనూజ అభిమానులు జాగ్రత్త..
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ ఫినాలే కి సిద్ధం అయ్యింది. ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు.
Telangana Police arrangements for Bigg Boss Season 9 grand finale
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే కి సిద్ధం అయ్యింది. ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈసారి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు, నలుగురు కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. కానీ, ఈ సీజన్ విజేత ఎవరు అనేది మాత్రం ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. అందులో కళ్యాణ్ పడాల, తనూజ పేర్లు గట్టిగ వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారనేది ఇప్పుడు ఉత్కంతగా మారింది. వోటింగ్ లో చూసుకుంటే కళ్యాణ్ పడాల ముందు ఉన్నట్టుగా తెలుస్తోంది. 40% వోటింగ్ తో కళ్యాణ్ టాప్ లో కొనసాగుతున్నాడు. 38% వోటింగ్ తో తరువాతి ప్లేస్ లో తనూజ ఉంది.
ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం ఏర్పాట్లు కూడా భారీగానే చేస్తున్నారు బిగ్ బిన్(Bigg Boss 9 Telugu) టీం. గతంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ వద్దకు భారీగా ఫ్యాన్స్ రావడం, పల్లవి ప్రశాంత్ కి పోలీసుకు సూచలను ఇచ్చినా వాటిని పాటించకపోవడంతో గందరగోళం ఏర్పడింది. బస్సు, కారు అద్దాలను పగలగొట్టారు. దానిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దానికి కారణం అయిన పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసి జైలుకి పంపారు.
ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చాడు పల్లవి ప్రశాంత్. దీంతో, మరోసారి అలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిగ్ బాస్ టీం. పోలీసులకు కూడా ఇప్పటికే సమాచారం అందిచారట. కాబట్టి, అభిమానులు కాస్త కంట్రోల్ లో ఉండటం మంచిది. మరీ ముఖ్యంగా కళ్యాణ్ పడాల, తనూజ ఫ్యాన్స్ కి చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ ఇద్దరి మధ్యనే టైటిల్ పోరు జరుగనుంది. కాబట్టి, ఎవరు గెలిచినా మిగిలిన అభిమానులు కాస్త డిజప్పాయింట్ అవడం ఖాయం. కాబట్టి, కాస్త కంట్రోల్ లో ఉండటం మంచిది. ఏమాత్రం ఎక్కువ చేసిన కూడా ఉపేక్షించేది లేదు అని సమాచారం. డైరెక్ట్ తీసుకెళ్లి జైల్లో వేయడానికి సిద్ధంగా ఉన్నారట పోలీసులు. గతంలో జరిగిన సంఘటన వల్ల పోలీస్ వ్యవస్థపై కూడా చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. కాబట్టి, మరోసారి అలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేలా చేసుకుంటున్నారట.
