Anasuya Bharadwaj: నెటిజన్ దారుణమైన కామెంట్.. సైబర్ క్రైం పోలీసులకు ట్యాగ్ చేసిన అనసూయ..
నెటిజన్స్ యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj)పై దారుణమైన కామెంట్ చేశాడు. దానికి అనసూయ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.
Netizen vulgar comment on anchor Anasuya bharadwaj
Anasuya Bharadwaj: సోషల్ మీడియాలో నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. సెలబ్రెటీలు టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు మనల్ని పట్టించుకోరు అనే రీతిలో ఎవరికీ ఇష్టంవచ్చినట్టుగా వాళ్ళు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత పట్టించుకోకుండా ఉన్నప్పటికీ కొన్ని కామెంట్స్ శృతి మించుతుండటంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా కూడా ఏమాత్రం మారడం లేదు కొంతమంది ఆకతాయిలు. మరీ ముఖ్యంగా లేడీ సెలబ్రెటీలు టార్గెట్ గా వల్గర్ కామెంట్స్ చేస్తూ శుకానందాన్ని పొందుతున్నారు. తాజాగా మరో నెటిజన్స్ యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj)పై దారుణమైన కామెంట్ చేశాడు.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్ కి వార్నింగ్.. కళ్యాణ్, తనూజ అభిమానులు జాగ్రత్త..
దానికి అనసూయ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. రీసెంట్ గా అనసూయ శారీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి, ఒక నెటిజన్స్ కామెంట్ చేస్తూ “మొన్న నిధి పాపను నలిపేసినట్టు.. నిన్ను కూడా నలిపేయాలి” అంటూ వల్గర్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కి రియాక్ట్ అయిన అనసూయ సీరియస్ అయ్యింది. “ఇలాంటి వాళ్ళని ఎం చేయాలి. ఆరోజు పాపం నిధిని చూస్తే నాకే బాధేసింది. తెలంగాణ పోలీస్ కాస్త గమనించండి. వెంటనే యాక్షన్ తీసుకోండి”అంటూ తెలంగాణ పోలీస్, సైబర్ క్రైం పోలీస్ లను ట్యాగ్ చేసింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
