Bigg Boss Telugu 10 First Captain : బిగ్ బాస్ మొదటి కెప్టెన్.. పోరాడి గెలిచిన ఝాన్సీ.. షాలిని, అగ్నిపరీక్ష బ్యాచ్ గ్రూపిజం.. బిగ్ బాస్ 10 ‘డే 12’ ఫుల్ ఎపిసోడ్..
కెప్టెన్సీ రేసులో ఉన్న త్రిగున్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలిని లు చిక్కకు - దొరకకు అనే టాస్క్ ఇచ్చారు.(Bigg Boss Telugu 10 First Captain)
- Saketh U
- Published on- September 18, 2026 / 10:43 PM IST
Bigg Boss Telugu 10 First Captain
Bigg Boss Telugu 10 First Captain : నిన్న జరిగిన టాస్క్ గురించి త్రిగున్, వంశీ, కృష్ణుడు మాట్లాడుకున్నారు. ఎప్పట్లాగే రోహిత్ తన వాషింగ్ పని తప్పించుకోవడానికి చరణ్ ని హెల్ప్ అడిగాడు. అనంతరం వంశీ, నరేష్, రోహిత్, త్రిగున్, అమన్, రామ్ ప్రసాద్ కలిసి ఛత్రపతి సీన్ రీ క్రియేట్ చేసి నవ్వించారు. దీనికి బిగ్ బాస్ మెచ్చుకున్నారు. ఇక కెప్టెన్సీ రేసులో ఉన్న త్రిగున్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలిని లు చిక్కకు – దొరకకు అనే టాస్క్ ఇచ్చారు.
వెళ్ళాను ఒక జైలులో ఉంచి మిగిలిన వాళ్ళని గార్డ్స్ గా బయట పెట్టారు. వాళ్ళని దాటుకొని ఒక గోడ దాటి అవతలి వైపు ఉన్న సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి. గార్డ్స్ ఎవర్ని కావాలంటే వాళ్ళను ఆపుకోవచ్చు. ప్రతి రౌండ్ లో చివరి వరకు వెళ్లకుండా ఉన్న వాళ్ళు టాస్క్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఈ గేమ్ కి వంశీ, రోహిత్ లు సంచాలక్ గా ఉన్నారు. అయితే ఎప్పట్లాగే అగ్నిపరీక్ష బ్యాచ్ షాలిని ని కాపాడాలని ప్లాన్స్ వేశారు కానీ మిగిలిన వాళ్ళు ఒప్పుకోలేదు. మొదట షాలిని అవుట్ అయిపొయింది. దీంతో అగ్ని పరీక్ష బ్యాచ్ ఎందుకు షాలినిని ఆపారు అని వేరే వాళ్ళతో గొడవ పడ్డారు. షాలిని కూడా అందరూ నన్ను టార్గెట్ చేసారు అని చరణ్ తో చెప్పుకుంది. వాళ్ళ అగ్నిపరీక్ష బ్యాచ్ షాలిని ని ఆపినందుకు రోహిత్ సుధీర్ తో గొడవ పడ్డారు.
Also Read : Kaagitham Padavalu Review : ‘కాగితం పడవలు’ రివ్యూ.. చిన్నప్పటి నుంచి ప్రేమ పెద్దయ్యాక ఏమైంది?
ఇక నెక్స్ట్ రౌండ్ లో రోహిత్, వంశీలకు ఎవర్నైనా ఇద్దరు గార్డ్స్ ని తీసేయమంటే కృష్ణుడు, సుధీర్ లను తీసేసారు. బిగ్ బాస్ షాలినిని కొత్త గార్డ్ చేసారు. ఈ రౌండ్ లో ముకేశ్ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో ముకేశ్ – షాలిని గొడవ పెట్టుకున్నారు. నెక్స్ట్ నరేష్, దేబ్జానీలని గార్డ్స్ గా పక్కకు తప్పించారు. ముకేశ్ కొత్త గార్డ్ అయ్యాడు. వంశీ – రోహిత్ లలో వంశీ కూడా గార్డ్ గా మారాడు. చివరి రౌండ్ లో అందరూ కలిసి త్రిగున్ ని టార్గెట్ చేసి అవుట్ చేసారు. ఫైనల్ గా రామ్ ప్రసాద్ – ఝాన్సీ మిగిలారు.
వీళ్లిద్దరికీ కెప్టెన్సీ ఫైనల్ టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. ఒక బాక్స్ లో ఉన్న కట్టర్ ని తీసుకొని ఒక కాలితో గీసిన డబ్బాల్లో గెంతుతూ ఒక కంచెని ఆ కత్తితో కట్ చేసి దాని లోపలి నుంచి వెళ్లి అక్కడ ఉన్న తాళాలతో ఒక బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న బరువులు తీసుకొచ్చి కెప్టెన్ జెండాని పైకి తీసుకు రావాలి. ఈ గేమ్ లో రామ్ ప్రసాద్ తడబడటంతో ఝాన్సీ గెలిచి కెప్టెన్ అయింది. బిగ్ బాస్ సీజన్ 10 లో మొదటి కెప్టెన్ గా ఝాన్సీ గెలిచింది. దీంతో ఆమెకు కెప్టెన్ రూమ్ ఇచ్చారు. బిగ్ బాస్, కంటెస్టెంట్స్ అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఇక రేపు వీకెండ్ ఎపిసోడ్ కావడంతో ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Varun Tej : ఇటలీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కొడుకు మొదటి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
