Bigg Boss 10 Today Promo : రెచ్చగొట్టిన నాగార్జున.. రెచ్చిపోయిన సృష్టి.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.. పళ్ళు రాలిపోతాయి.. సుధీర్ పై ఫైర్..

స్పెషల్ గా ఈ ప్రోమో అంతా సుధీర్ - సృష్టిలపైనే చూపించారు. (Bigg Boss 10 Today Promo)

  • Published on- September 21, 2026 / 10:52 AM IST

Bigg Boss 10 Today Promo

Bigg Boss 10 Today Promo : నిన్న వీకెండ్ ఎపిసోడ్ అయ్యాక నేడు సోమవారం నామినేషన్స్ ఫైర్ తో మొదలయింది బిగ్ బాస్. తాజాగా నేటి ప్రోమోని రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో నామినేషన్స్ జరుగుతున్నట్టు చూపించారు. అయితే స్పెషల్ గా ఈ ప్రోమో అంతా సుధీర్ – సృష్టిలపైనే చూపించారు.

వీకెండ్ రెండు రోజులు నాగార్జున సృష్టి ఈ వారం అసలు ఏం యాక్టివ్ గా లేదు, మాట్లాడలేదు అని చెప్పి ఆమెని ఆడియన్ లా కుర్చోపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ్టి నుంచి సృష్టి రెచ్చిపోయింది. కొన్ని డేస్ గా సుధీర్ సృష్టితో లవ్ ట్రాక్ నడపడానికి ట్రై చేస్తుంటే సృష్టి కూడా మొదట్లో పాజిటివ్ గా స్పందించింది. కానీ ఇవాళ మాత్రం నామినేషన్స్ ఫైర్ లో సుధీర్ పై సృష్టి విరుచుకుపడింది.

Also Read : Krishnudu : ‘కృష్ణుడు’ ఎలిమినేట్.. రెండు వారాలకు ఎన్ని లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?

పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.. గూబ గుయ్యిమంటుంది.. పళ్ళు రాలిపోతాయి.. నువ్వు నా టైప్ కాదు.. అంటూ సుధీర్ పై అరిచింది. సుధీర్ అయితే థ్యాంక్స్ బిగ్ బాస్ నాకు ఫ్రీడమ్ వచ్చింది అని అనడంతో మరోసారి సృష్టి రెచ్చిపోయింది. అయితే తనే అరిచి తనే తిట్టి చివరకు తనే ఏడ్చింది. సుధీర్ – సృష్టి తిట్టుకొని మధ్యలో త్రిగున్ పేరు తేవడం గమనార్హం. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమో చూస్తుంటే నాగార్జున తిట్టడంతో సుధీర్ ని వాడుకొనే సృష్టి కంటెంట్ ఇవ్వాలని, వైరల్ అవ్వాలని చూస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది.

మీరు కూడా నేటి ప్రోమో చూసేయండి..