Bigg Boss Weekend Episode : మిథిలేష్ అవుట్.. పిచ్చ తిట్లు తిట్టిన త్రిగున్.. వచ్చిన రెండు రోజుల్లోనే కొత్త కెప్టెన్.. బిగ్‌బాస్ 10 డే 21 వీకెండ్ ఎపిసోడ్‌..

మిథిలేష్ 15 లక్షలు తీసుకొని స్టేజిపైకి నాగార్జున దగ్గరకు వచ్చాడు. (Bigg Boss Weekend Episode)

  • Published on- September 27, 2026 / 10:38 PM IST

Bigg Boss Weekend Episode

Bigg Boss Weekend Episode : వైల్డ్ కార్డు ఎంట్రీ మిథిలేష్ ఒక్కరోజు ఉండి నాగార్జున ఇచ్చిన ఆఫర్ 15 లక్షలు తీసుకొని నిన్న బయటకు వచ్చేసిన సంగతి తెల్సిందే. అందరూ డిస్కషన్ చేసుకున్నారు మిథిలేష్ వెళ్తున్నందుకు. సగం మంది తప్పు అన్నారు. అగ్నిపరీక్ష టీమ్ అది మిథిలేష్ ఇష్టం అని అన్నారు. విన్నర్ ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వాలి అని ముకేశ్, వంశీ, త్రిగున్, దేబ్జానీ ఫైర్ అయ్యారు. ముకేశ్, త్రిగున్ ఈ విషయంలో రామ్ ప్రసాద్ పై ఫైర్ అయ్యారు. ఇక రోహిత్ తన అగ్నిపరీక్ష టీమ్ మిథిలేష్ కి సపోర్ట్ చేసుకొచ్చాడు. త్రిగున్ సిగ్గు, శరం లేదు అని ఫైర్ అయ్యారు. మిథిలేష్ కి సపోర్ట్ చేసిన వాళ్ళందర్నీ ముకేశ్, త్రిగున్ పిచ్చ తిట్లు తిట్లు తిట్టారు. చివరికి అమన్ కూడా సపోర్ట్ చేయడంతో అందరూ అమన్ ని తిట్టారు. అమన్ – త్రిగున్ కొట్టుకునే దాకా వెళ్లారు.

అనంతరం మిథిలేష్ 15 లక్షలు తీసుకొని స్టేజిపైకి నాగార్జున దగ్గరకు వచ్చాడు. వెళ్లేముందు మిథిలేష్ ని ఒక 5 గురికి ఎవరి గురించి జాగ్రత్త పడాలి చెప్పమన్నాడు నాగ్. అమన్ – రోహిత్ తో జాగ్రత్త అని చెప్పాడు. వర్షిణి – ముకేశ్ తో జాగ్రత్త పడాలి, వంశీ – త్రిగున్ తో జాగ్రత్త పడాలి, నరేష్ – రామ్ ప్రసాద్ తో జాగ్రత్త పడాలి, చరణ్ – షాలినితో జాగ్రత్త పడాలి అని చెప్పాడు. నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నవాళ్ళను పిలిచి ఝాన్సీ సేవ్ అయింది అని చెప్పారు నాగ్.

అనంతరం బిగ్ బాస్ జంగిల్ గేమ్ అని చెప్పి అక్కడ కొన్ని జంతువుల బొమ్మలతో ఉన్న మెడల్స్ ని పెట్టారు. ఒక్కో యానిమల్ కి ఒక్కో క్వాలిటీ ఇచ్చారు. ఆ క్వాలిటీని బట్టి ఒక్కొక్కరు వాళ్లకు నచ్చిన మెడల్ ని ఒక కంటెస్టెంట్ కి ఇవ్వాలి, ఎందుకో చెప్పాలి.

Also Read : Bigg Boss Today Promo : సిగ్గు శరం లేదు.. వాళ్లపై ఫైర్ అయిన త్రిగున్.. అమన్‌, రామ్ ప్రసాద్ లతో కొట్లాట.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..

ముకేశ్ – ప్యారెట్ తీసుకొని అమన్ కి ఇచ్చి డెసిషన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు, డెసిషన్ మేకింగ్ లేదు. వేరేవాళ్లు చెప్పినవి వింటాడు అని ఇచ్చాడు. రామ్ ప్రసాద్ – నెమలి మెడల్ తీసుకొని షాలిని కి ఇచ్చి షో అప్ చేస్తుంది. ప్రతిదీ ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అన్నాడు. షాలిని – స్నేక్ మెడల్ తీసుకొని పాయిజన్ నెస్ అపూర్వ కి ఇచ్చి పాత గొడవలు ఉన్నాయని, సృష్టిని తప్పు అన్నందుకు ఇచ్చానని చెప్పింది. ఇక నాగార్జున షాలినిని తిట్టాడు ఓవర్ యాక్షన్, బిగ్ బాస్ చెప్పినా వినవు అని. నరేష్ – పాండా మెడల్ తీసుకొని లేజీ అని దేబ్జానీకి ఇచ్చాడు. అపూర్వ – స్నేక్ మెడల్ తీసుకొని పాయిజన్ నెస్ అని త్రిగున్ కి ఇచ్చింది. సపోర్ట్ చేసినట్టే ఉంటాడు కానీ గేమ్ ఆడతాడు అని చెప్పింది. రోహిత్ – నక్క మెడల్ తీసుకొని కన్నింగ్ అని త్రిగున్ కి ఇచ్చాడు. త్రిగున్ ని ట్రస్ట్ చేయొద్దు అని చెప్పాడు. అలాగే త్రిగున్ ని తిట్టడంతో నాగార్జున రోహిత్ పై ఫైర్ అయ్యాడు. వంశీ – మంకీ మెడల్ తీసుకొని త్రిగుణ కి ఇచ్చి అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాడు అని చెప్పాడు. ఝాన్సీ పాండా మెడల్ తీసుకొని లేజీ అని రోహిత్ కి ఇచ్చి వర్క్ చెయ్యట్లేదు అని చెప్పింది. వర్షిణి – సింహం మెడల్ ముకేశ్ కి ఇచ్చి ఫియర్ లెస్ అని చెప్పింది. సుధీర్ కూడా సింహం మెడల్ ముకేశ్ కి ఇచ్చి ఫియర్ లెస్ అని చెప్పింది. చరణ్ – ప్యారెట్ మెడల్ వర్షిణికి ఇచ్చి బ్లైండ్ ఫాలోవర్ ముకేశ్ ని ఫాలో అవుతుంది అని చెప్పాడు. సృష్టి – మంకీ మెడల్ ని ఇబ్బందిగా ఉంటుంది అని అపూర్వకి ఇచ్చింది. దేబ్జానీ – మంకీ మెడల్ ని ఇబ్బందిగా ఉంటుంది అని షాలినికి ఇచ్చింది. త్రిగుణ – పీకాక్ మెడల్ ని షో ఆఫ్ అని వంశీ కి ఇచ్చాడు. అమన్ – నక్క మెడల్ ని కన్నింగ్ అని ముకేశ్ కి ఇచ్చాడు.

తర్వాత ముకేశ్ బాత్రూం సంఘటన హౌస్ లో వాళ్లకు చెప్పింది నాగార్జున మళ్ళీ గుర్తుచేసి అందర్నీ నవ్వించాడు. ఆ తర్వాత ఫహద్ ఫాజిల్, సారా, కార్తికేయ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రమోషన్స్ లో బిగ్ బాస్ కి వచ్చారు. వాళ్ళు వచ్చాక కంటెస్టెంట్స్ ని రెండు గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక గేమ్ ఆడించారు. డ్యాన్సులు వేయించారు. నెక్స్ట్ నామినేషన్స్ ఉన్న వాళ్ళని పిలిచి త్రిగున్ సేవ్ అయ్యాడు అని చెప్పారు. రోహిత్ కి మేనల్లుడు పుట్టాడని ఆ బాబు ఫోటో చూపించారు. దాంతో రోహిత్ ఎమోషనల్ అయ్యాడు.

Also See : Shree bhanu : కేర‌ళ కుట్టీ స్టైల్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. భానుశ్రీ ఫోటోలు వైర‌ల్‌..

నామినేషన్స్ లో చివరకు వంశీ, వర్షిణి మిగిలారు. అయితే టెంప్టేషన్ వీక్ కాబట్టి కెప్టెన్ ముకేశ్ కి నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఇందులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. నువ్వు వాళ్ళను కాపాడొచ్చు కానీ నీ ఇమ్యూనిటీ, కెప్టెన్సీ పోతుంది అని చెప్పారు. అలాగే నెక్స్ట్ వీక్ నువ్వు డైరెక్ట్ నామినేషన్స్ లో ఉంటావు. ఇవి ఒప్పుకుంటే ఇద్దరు ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ లో ఉంటారు అని చెప్పారు నాగార్జున. ముకేశ్ వాటన్నిటికీ ఒప్పుకొని వర్షిణి, వంశీని సేవ్ చేసాడు. దీంతో ముకేశ్ కెప్టెన్సీ తీసేసి అపూర్వ కి ఇచ్చారు. ముకేశ్ తో కలిసి టాస్క్ గెలిచారు కాబట్టి. దీంతో అపూర్వ వచ్చిన రెండు రోజుల్లోనే కొత్త కెప్టెన్ గా సెలెక్ట్ అయి బిగ్ బాస్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇక నాలుగో వారం టోటల్ డామినేషన్ అనే అవతారంలో టాస్కులు జరగనున్నాయి అని తెలుస్తుంది.