Bigg Boss Today Promo : సిగ్గు శరం లేదు.. వాళ్లపై ఫైర్ అయిన త్రిగున్.. అమన్, రామ్ ప్రసాద్ లతో కొట్లాట.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..
Bigg Boss Today Promo
Bigg Boss Promo
Bigg Boss Today Promo : నిన్న శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఇచ్చిన ఆఫర్ ని మిథిలేష్ 15 లక్షలు తీసుకొని వెళ్ళిపోయినట్టు చూపించారు. అయితే అది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఓట్లు వేయడం వల్లే జరిగింది. ఆ 15 లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామని చెప్పారు. రామ్ ప్రసాద్ వేరే కంటెస్టెంట్స్ ని అడిగితే కప్పు కావాలి అని కొంతమంది చెప్పడంతో మిథిలేష్ కి సూట్ కేస్ ఇచ్చి పంపించాడు.
దీంతో త్రిగున్, ముకేశ్ రామ్ ప్రసాద్ పై ఫైర్ అయ్యారు. విన్నర్ డబ్బుల్లోంచి కట్ చేస్తారు అలా ఎలా పంపిస్తావు, లోపలే ఉంచి నామినేట్ చేసి పంపాలి కదా అని ఫైర్ అయ్యారు. మిథిలేష్ కి డబ్బులు ఇచ్చి పంపించడానికి సపోర్ట్ చేసిన వాళ్లపై త్రిగున్ సిగ్గు శరం లేదు అంటూ ఫైర్ అయ్యాడు. చివర్లో అమన్ సపోర్ట్ చేయడం వల్లే మిథిలేష్ కి 15 లక్షలు రావడంతో ముకేశ్, త్రిగున్ అమన్ మీద కూడా ఫైర్ అయ్యారు. దీంతో మాట మాట అనుకోని అమన్ – త్రిగున్ కొట్టుకునేదాకా వెళ్లారు. మధ్యలో వంశీ కూడా ఫైర్ అయ్యాడు. మొత్తానికి మిథిలేష్ చేసిన దానికి ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు అయ్యేలానే ఉన్నాయి.
Also See : Shanmuk Jaswanth : పెంపుడు కుక్క బర్త్ డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన షణ్ముఖ్ జస్వంత్..
మీరు కూడా బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూసేయండి..
