Bigg Boss Telugu 10 : ఓటీటీలో నెంబర్ 1 ప్లేస్ లో దూసుకుపోతున్న తెలుగు బిగ్ బాస్..
ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదలైన సంగతి తెలిసిందే. (Bigg Boss Telugu 10)
Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10 : ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదలైన సంగతి తెలిసిందే. స్టార్ మా ఛానల్ తో పాటు జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది బిగ్ బాస్. ఈసారి ‘బిగ్ బాస్ సౌత్ కార్నివాల్’ అంటూ మోహన్‌లాల్ (మలయాళం), నాగార్జున (తెలుగు), కిచ్చా సుదీప్ (తెలుగు) మరియు విజయ్ సేతుపతి (తమిళం) నలుగురు హోస్ట్ లు నాలుగు భాషలు ఒకే రోజు ప్రారంభం కావడంతో సౌత్ ఆడియన్స్ కి మరింత ఆసక్తి నెలకొంది. ఆ రోజు నలుగురు హోస్ట్ లు తమ తమ షోల నుండి కలిసి కనిపించి బిగ్ బాస్ ఘన విజయం సాధించాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
నాలుగు భాషల్లో బిగ్ బాస్ దూసుకుపోతుండగా ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మాణంలో బిగ్ బాస్ తెలుగు జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఎండెమోల్ షైన్ ఇండియా బిగ్ బాస్ తెలుగు 10 వ సీజన్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో అగ్రగామిగా మొదటి వారంలోనే నిలిచింది.
Also See : Roopa Koduvayur : బ్లాక్ డ్రెస్ లో తెలుగమ్మాయి రూప.. అందమైన రూపంతో.. ఫొటోలు..
ఈ తాజా ర్యాంకింగ్ బిగ్ బాస్ తెలుగు పట్ల ప్రేక్షకులకు ఉన్న ఆసక్తిని తెలియచేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రేక్షకులు బిగ్ బాస్‌ని ఎక్కువగా చూస్తున్నారు. ఈ విజయం భారతదేశంలో బిగ్ బాస్ ఫ్రాంచైజీని నిర్మించే బనిజయ్ ఆసియాలో భాగమైన ఎండెమోల్ షైన్ కూడా హైలెట్ అవుతుంది. ఎండెమోల్ షైన్ ఇండియా బిగ్ బాస్‌ను శక్తివంతమైన మల్టీ మార్కెట్ వినోద ఫ్రాంచైజీగా నిర్మించింది.
