Bigg Boss Telugu 5 Winner Vj Sunny
Bigg Boss Telugu 5 Winner : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. 105 రోజలు పాటు సాగిన ఈ రియాల్టీ షో లో మిగతా కంటెస్టెంట్లను వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు సన్నీ. టైటిల్ తో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ, సువర్ణ భూమి వారి షాద్ నగర్ వెంచర్ లో రూ.25 లక్షల విలువ చేసే స్థలం సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో రన్నరప్‌గా షణ్ముక్ జశ్వంత్ నిలవగా, సెకండ్ రన్నరప్‌గా శ్రీరామ చంద్ర నిలిచాడు.
సిరి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సన్నీ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. చివరకు సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కు చేరారు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ బిగ్ బాస్ సీజన్ 5 విజేత సన్నీ అని ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ 5 విన్నర్ గా సన్నీ అవతరించాడు.
సన్నీ గెలుపుతో అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర అతడి ఫ్యాన్స్ హంగామా చేశారు. మాదాపూర్ లోని సన్నీ ఇంటి దగ్గర ఎస్ కన్వెన్షన్ లో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు.
గ్రాండ్ ఫినాలేలో టాప్-5లో ముందుగా సిరి ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత మానస్, శ్రీరామ్ ఎలిమినేట్ అయ్యారు. చివరకు సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కు చేరారు. మచ్చా మచ్చా అంటూ మచ్చలేని నిండు మనసుతో అందరితో ఆప్యాయంగా ఉంటూ స్నేహితుడంటే వీడేరా అనేట్టుగా గేమ్ ఆడాడు సన్నీ. ఎవరెన్ని కుట్రలు చేసినా.. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా.. ఆట తప్ప వేరే ధ్యాస లేకుండా అప్నా టైం ఆయేగా అనుకుంటూ గేమ్‌లో దూసుకెళ్లాడు. చివరికి కోట్లాది మంది ప్రేక్షకుల మద్దతుతో బిగ్ బాస్ టైటిల్‌ని ఎగరేసుకుపోయాడు సన్నీ. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సన్నీ… నిజాయితీతో కూడిన ఆటతో బిగ్ బాస్ విన్నర్ గా అవతరించాడు.
బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే వరకూ సన్నీ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజు నుంచే ఎంటర్ టైన్ మెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.
1989 అగస్టు 17న ఖమ్మంలో జన్మించిన సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. సన్నీ జర్నలిస్ట్ గా, రేడియో జాకీగా, సీరియల్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. ఇంటర్ వరకూ ఖమ్మంలోనే చదివిన సన్నీ.. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో బీకాం పూర్తి చేశాడు. సినిమాలపై ఉన్న మక్కువతో ఇంట్లో తెలియకుండానే యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఒకపూట కాలేజ్.. ఒక పూట యాక్టింగ్‌కి వెళ్లేవాడు. ఆ తరువాత మెల్లమెల్లగా జర్నలిజం ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. మొదట వీజేగా పని చేసి.. జస్ట్ ఫర్ మెన్ అనే ఇంటర్వ్యూ కార్యక్రమంతో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ తరువాత ఫిల్మ్ అండ్ స్పోర్ట్స్ రిపోర్టర్‌గా ఏబీఎన్ ఛానల్‌లో పనిచేసి.. స్టార్ మ్యూజిక్‌కి వెళ్లాడు. ఆ పరిచయాలతో ‘కళ్యాణ వైభోగం’ సీరియల్‌లో మెయిన్ లీడ్ సంపాదించి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సన్నీ.. ‘సకల గుణాభి రామ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేతగా వీజే సన్నీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాడని చెప్పాలి. మొదటి ఎపిసోడ్ నుంచి నెగిటివిటి ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత తన గేమ్ స్టైల్‌ని మార్చుకుంటాడు వెళ్లాడు. టాస్కుల్లో విజయం సాధించడమే కాదు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లను దక్కించుకొని ఏకంగా బిగ్‌బాస్ 5 టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ఈ సీజన్ మొత్తం బాగా యాక్టివ్ గా ఉన్న కంటెస్టెంట్ సన్నీ మాత్రమేనని, విజయానికి అన్ని విధాల అర్హుడు అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు మొదలయ్యాయి.