Bigg Boss Telugu 7 Day 46 Promo
Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఏడో వారం కొనసాగుతోంది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా గులాబీపురం, జిలేజీపురం అనే రెండు గ్రూపులుగా హౌస్‌లో ఉన్న వాళ్లను
బిగ్‌బాస్ విభజించారు. తాజాగా నేటి (గురువారం) ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. శివాజీకి ప్రియాంక తాంబూలాన్ని తినిపించింది. నువ్వు అలా నడిచి వస్తుంటే… నెమలి వచ్చినట్లు ఉంది అంటూ శివాజీ అన్నాడు. టాస్క్‌లో భాగంగా భార్య భర్తలుగా ఉన్న టేస్టీ తేజ, శోభా శెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ రోజు మన పెళ్లి రోజు.. ఈ డ్రెస్ గుర్తు పట్టావా..? అని తేజా అనగా గుర్తు పట్టలేదని శోభా అనింది. ఫస్ట్ నైట్ రోజు ఇదే డ్రస్ వేసుకున్నా అని తేజా అంటాడు.
జోతిష్యుడి గెటప్‌ను బోలె వేయగా అతడిని తేజా.. ఈ రోజు నా ఫస్ట్ నైట్ జరుగుతుందా లేదా చెప్పండి అడుగుతాడు. ఫస్ట్ నైట్ చాలా అద్భుతంగా కనబడుతోంది.. బట్.. అంటూ బోలె అనడంతో అక్కడ ఉన్న వారు నవ్వుతారు. గౌతమ్ కింద పడుకుని ఊపిరి అందనట్లు నటించగా శోభాశెట్టి పరుగున వచ్చి సీపీఆర్ చేస్తుంది. ఇది చూసిన తేజా కావాలని చేయగా.. శోభా పట్టించుకోదు. పక్కనే ఉన్న అమర్‌తో అతడికి నోటితో గాలిని ఊదమని చెబుతుంది. అతడు అలా చేసేందుకు యత్నించగా వెంటనే తేజా లేచి పరుగెత్తాడు. పెళ్లి రోజు, ఫస్ట్ నైట్ అంటూ తేజా పలుమార్లు అనడంతో శోభా శెట్టి సిగ్గు పడింది. ఆ మాట అనొద్దని అడిగింది. మొత్తంగా ఈ రోజు ఎపిసోడ్ పుల్ కామెడీగా ఉంటుందని ప్రొమోను బట్టి అర్థమవుతోంది.