Bigg Boss Telugu 8 Day 30 Promo 1 Taalam Vidipinchu Tyre Ni Nadipinchu Task
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఐదో వారం కొనసాగుతోంది. ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, విష్ణు ప్రియ, నైనిక, నాగ మణికంఠ, ఆదిత్య, నబీల్ లు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో వైల్డ్ కార్డులను ఆపేందుకు కంటెస్టెంట్లకు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో భాగంగా తాళం విడిపించు టైర్‌ను నడిపించు అనే టాస్క్‌ను ఇచ్చాడు బిగ్ బాస్.
స్విమ్మింగ్ పూల్ లో ఒక లాకర్ ను ఉంచారు. బయట తాళాలు పెట్టారు. బయట ఉన్న తాళాల్లో సరైన తాళం తీసుకుని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి, అందులో ఉన్న లాకర్ ను ఓపెన్ చేసి, టైర్ లను బయటకు తీసుకురావాలి. ఆ తరువాత టైర్లను ఒక టేబుల్ మీద నుంచి దొర్లించి బాస్కెట్ లో పడేలా చేయాలి. దీన్ని మొదటగా ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్లే విజేతలు అని బిగ్‌బాస్ చెప్పారు. ఈ గేమ్‌ను కంటెస్టెంట్లు ఫినిష్ చేస్తే ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపే అవకాశం ఇచ్చాడు.
Govinda : బాలీవుడ్ నటుడి కాలిలో దిగిన బుల్లెట్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..
శక్తి టీమ్ నుంచి నిఖిల్, కాంతార టీమ్ నుంచి విష్ణు ప్రియలు ఈ టాస్కులో పాల్గొన్నారు. నిఖిల్ పూల్‌లోని లాకర్ ఓపెన్ చేసి టేబుల్ పై టైర్‌లను దొర్లించాడు. అటు విష్ణు ప్రియ మాత్రం లాకర్ తాళం కూడా ఓపెన్ చేయలేకపోయినట్లుగా తెలుస్తోంది. అయితే.. నిర్ణీత సమయంలోగా నిఖిల్ ఈ టాస్క్‌ను పూర్తి చేయలేకపోయినట్లుగా ప్రొమోను బట్టి అర్థమవుతోంది. దీంతో వారు వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపే అవకాశాన్ని కోల్పోయారు. ఇక ప్రొమో ఆఖరిలో వైల్డ్ కార్డు ఎంట్రీలపై నిఖిల్‌తో మణికంఠ తన లెక్కలు చెబుతున్నాడు.