Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9.. మొదలైపోయిన సందడి.. ఫస్ట్, సెకండ్ సెలెబ్రిటీ హౌస్‌మేట్స్ వీరే..

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నవదీప్, అభిజిత్, బిందుమాధవిలు జడ్జీలుగా.. శ్రీముఖి హోస్ట్‌గా అగ్నిపరీక్ష ఆడిషన్స్ నిర్వహించారు.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9.. మొదలైపోయిన సందడి.. ఫస్ట్, సెకండ్ సెలెబ్రిటీ హౌస్‌మేట్స్ వీరే..

Updated On : September 7, 2025 / 7:56 PM IST

Bigg Boss Telugu 9: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. బిగ్ బాస్ షో కొత్త సీజన్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో 9వ సీజన్ ఆదివారంతో మొదలైంది.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ సెలెబ్రిటీ కంటెస్టెంట్ తనూజ. ఈమె బుల్లితెర భామ. సీరియల్ నటి. జరగండి జరగండి అనే సాంగ్ కి డ్యాన్స్ తో తనూజ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన రెండో కంటెస్టెంట్ ఆశాసైనీ. ఈమె సినిమా నటి. పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. అసలు పేరు ఫ్లోరా సైనీ. స్క్రీన్ నేమ్ ఆశాసైనీ అని ఆమె స్వయంగా తెలిపింది.

గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ సీజన్ 9 సాగబోతోంది. ఈసారి కంటెస్టెంట్స్ ఎంపికకు అగ్నిపరీక్ష నిర్వహించారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని ఆరాటపడుతున్న సామాన్యులకు అవకాశాన్ని కల్పిస్తూ బిగ్ బాస్ అగ్నిపరీక్ష పెట్టారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నవదీప్, అభిజిత్, బిందుమాధవిలు జడ్జీలుగా.. శ్రీముఖి హోస్ట్‌గా అగ్నిపరీక్ష ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో 13 మంది టాప్ కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు. వీరిలో ఐదుగురిని నేరుగా హౌజ్ లోకి పంపించబోతున్నారు.