Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. హౌస్‌లోకి వెళ్లిన థర్డ్, ఫోర్త్, సెలబ్రిటీ కంటెసెంట్స్ వీరే.. రెండో కామనర్ ఎవరంటే..

సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ తో ఈ బిగ్ బాస్ సీజన్ 9 మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం ఖాయం అంటున్నారు.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. హౌస్‌లోకి వెళ్లిన థర్డ్, ఫోర్త్, సెలబ్రిటీ కంటెసెంట్స్ వీరే.. రెండో కామనర్ ఎవరంటే..

Updated On : September 7, 2025 / 8:59 PM IST

Bigg Boss Telugu 9: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. బిగ్ బాస్ షో కొత్త సీజన్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో 9వ సీజన్ ఆదివారంతో మొదలైంది.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ సెలెబ్రిటీ కంటెస్టెంట్ తనూజ. ఈమె బుల్లితెర భామ. సీరియల్ నటి. జరగండి జరగండి అనే సాంగ్ కి డ్యాన్స్ తో తనూజ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన రెండో సెలెబ్రిటీ కంటెస్టెంట్ ఆశాసైనీ. ఈమె సినిమా నటి. పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. అసలు పేరు ఫ్లోరా సైనీ. స్క్రీన్ నేమ్ ఆశాసైనీ అని ఆమె స్వయంగా తెలిపింది.

హౌస్ లోకి అడుగు పెట్టిన తొలి కామనర్ కల్యాణ్…

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తొలి కామన్ మ్యాన్ (కామనర్) కల్యాణ్. ఈయన ఒక సోల్జర్. అగ్నిపరీక్షను దాటుకుని హౌస్ లోకి అడుగుపెట్టారు.

ఇద్దరు సెలబ్రిటీలు హౌస్ లోకి వెళ్లాక ఫస్ట్ కామనర్ గా జవాన్ కల్యాణ్ బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. ‘అగ్ని పరీక్ష’ దాటుకుని వచ్చిన మొదటి సామాన్యుడు అంటూ కల్యాణ్ ను ప్రశంసించారు నాగార్జున. నిజానికి అగ్ని పరీక్షలో కల్యాణ్ ని చూసిన ప్రేక్షకులు.. అసలు ఆయనను ఎంపిక చేస్తారో లేదో అనే సందేహాలు వ్యక్తం చేశారు. అలాంటిది ఆయననే ఫస్ట్ కామనర్ గా పంపించి బిగ్ బాస్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

హౌస్ లోకి అడుగుపెట్టగానే.. కల్యాణ్ కి టాస్క్ ఇచ్చారు నాగార్జున. హౌస్ లో వాష్ రూమ్ క్లీన్ చేసే డ్యూటీని తనూజ, ఆశాసైనీలలో ఎవరికి వేస్తారని అడగ్గా.. ఆ డ్యూటీని ఆశాసైనీకి అప్పగించారు కల్యాణ్.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన థర్డ్ సెలెబ్రిటీ కంటెస్టెంట్ ఇమ్మానుయల్. ఈయన కమెడియన్. జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఫోర్త్ సెలెబ్రిటీ కంటెస్టెంట్ శ్రేష్టి వర్మ. ఈమె డ్యాన్సర్, లేడీ కొరియోగ్రాఫర్.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రెండో కామన్ మ్యాన్ (కామనర్) హరీశ్. మాస్క్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. అగ్ని పరీక్ష దాటుకుని వచ్చిన హరీశ్ ని బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా పంపారు. జ్యురీ మెంబర్ బిందు మాధవి స్టేజ్ మీదకు వచ్చి హరీష్ ని ఎంపిక చేశారు. హౌస్ లోకి వెళ్లగానే హరీష్ కి నాగార్జున్ టాస్క్ ఇచ్చారు. శ్రేష్టి, ఇమ్మాన్యుయేల్ లో ఎవరికి బిగ్ బాస్ హౌస్ లో హౌస్ కీపింగ్ బాధ్యతలు ఇస్తారని అడగ్గా.. ఇమ్మాన్యుయేల్ కి ఆ బాధ్యతలు ఇచ్చారు హరీశ్.

ఈసారి రెండు హౌస్ లు ఉంటాయని హోస్ట్ నాగార్జున తెలిపారు. ఈసారి డబుల్ హౌస్ తో డబుల్ జోష్ ఉంటుందన్నారు. అగ్నిపరీక్షతో కామనర్స్ కి అవకాశం కల్పించారు. సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ తో ఈ బిగ్ బాస్ సీజన్ 9 మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం ఖాయం అంటున్నారు.