Bigg Boss 10 Telugu Nominations : సుధీర్ ని పిచ్చ తిట్లు తిట్టిన సృష్టి.. కొట్టుకోడానికి రెడీ అయిన సుధీర్ – త్రిగున్.. నామినేషన్స్ ఫైర్ మాములుగా లేదుగా.. బిగ్ బాస్ 10 ‘డే 15’ ఎపిసోడ్..

సృష్టి సుధీర్ పై ఫుల్ గా ఫైర్ అయింది.(Bigg Boss 10 Telugu Nominations)

  • Updated on- September 22, 2026 / 11:00 AM IST

Bigg Boss Telugu Day 15 Full Episode Nominations

Bigg Boss 10 Telugu Nominations: నిన్న వీకెండ్ ఎపిసోడ్ అయిపొయింది. మొదట హౌస్ లో సృష్టి త్రిగున్ తో సుధీర్ గురించి మాట్లాడింది చూపించారు. సుధీర్ – వర్షిణి మాట్లాడుకున్నారు. దేబ్జానీ కాఫీ గొడవ రామ్ ప్రసాద్ తో డిస్కషన్ జరిగింది. అనంతరం ముకేశ్ ని లోపలికి పిలిచి బిగ్ బాస్ మాట్లాడాడు. టెంప్టేషన్స్ & టెన్షన్స్ కార్డు అతనికి ఇచ్చి. టెంప్టేషన్స్ కి నామినేషన్స్ లో ఇమ్యూనిటీ ఇచ్చారు. అలాగే రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఝాన్సీ ఇమ్యూనిటీ తీసుకోవాలి లేదా ఝాన్సీ కెప్టెన్ తీసి త్రిగుణ కి ఇవ్వాలి అని. దానికి ముకేశ్ ఝాన్సీ ఇమ్యూనిటీ తీసేస్తా అన్నాడు. బయటకు వచ్చి ఇదే విషయం ఝాన్సీతో మాట్లాడాడు. ఝాన్సీ కూడా కరెక్ట్ అని ఒప్పుకుంది.

సుధీర్ – సృష్టి మధ్య రిలేషన్, వాళ్ళు మాట్లాడిన మాటల గురించి డిస్కషన్ జరిగింది. ముకేశ్ కి ఇచ్చిన టెంప్టేషన్ వాళ్ళ ఈ వారం నామినేషన్స్ లేకుండా సేవ్ అయ్యాడు. ఓ ఎన్వలప్ గేమ్ తో ఎవరు నామినేషన్స్ లో పాల్గొనాలి అని డిసైడ్ చేసాడు బిగ్ బాస్. మొదట ముకేశ్ ని ఎవరు పాల్గొనాలి అని అని బిగ్ బాస్ అడిగితే రామ్ ప్రసాద్, చరణ్ పేర్లు చెప్పారు. అయితే చివరకి రామ్ ప్రసాద్ ఒక్కడే నామినేషన్ కి అర్హత సాధించాడు. అతనికి వచ్చిన ఎన్వలప్ లో రెండు నామినేషన్స్ చేయొచ్చు లేదా ఒకటి మీరు చేసి ఇంకోటి ఇంకొకరికి అవకాశం ఇవ్వొచ్చుఅని చెప్పాడు బిగ్ బాస్. దీంతో రెండు నామినేషన్స్ రావడంతో రామ్ ప్రసాద్.. వంశీని నామినేట్ చేసాడు. ఫుడ్ విషయంలో అరుస్తున్నందుకు. ఈ విషయంలో వర్షిణి, దేబ్జానీలతో వంశీ కి గొడవ అయింది.

Also Read : Bigg Boss Today Promo : కొట్టుకోడానికి రెడీ అయిన సుధీర్ – త్రిగున్.. నామినేషన్స్ ఫైర్.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..

తన ఇంకో నామినేషన్ ఛాన్స్ రోహిత్ కి ఇచ్చాడు. తనని చెక్ చేయడానికి ఇచ్చాను అని చెప్పాడు రామ్ ప్రసాద్. రోహిత్.. సుధీర్ ని నామినేట్ చేసాడు. వర్షిణి నిన్ను కంట్రోల్ చేస్తుంది అని పాతవి చెప్పి. మధ్యలో సృష్టి పేరు రావడంతో సుధీర్ -సృష్టి మధ్య గొడవ అయింది. సృష్టి సుధీర్ పై ఫుల్ గా ఫైర్ అయింది. పళ్ళు రాలుతాయి, గుద్దుతా, పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ సుధీర్ పై సృష్టి ఫైర్ అయింది. తన క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు సుధీర్, నేనే తన వెనక తిరిగాను అని చెప్తున్నాడు అంటూ సృష్టి ఏడ్చేసింది. ఈ మధ్యలో సుధీర్ త్రిగున్ ని తీసుకురావడంతో వాళ్లిద్దరూ గొడవ పడి కొట్టుకోడానికి రెడీ అయ్యారు. తర్వాత అమన్ – సుధీర్ తిట్టుకున్నారు. ఈ గొడవ చాలా సేపే సాగింది.

అనంతరం వర్షిణికి నామినేషన్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇద్దర్ని చేయాల్సి వస్తే ఒకటి సుధీర్ కి ఇచ్చింది. వర్షిణి.. షాలిని ని నామినేట్ చేసింది. సుధీర్.. అమన్ ని నామినేట్ చేసాడు. తర్వాత చరణ్ కి ఛాన్స్ వచ్చింది. చరణ్ కి కూడా రెండు ఛాన్సులు రావడంతో ఒకటి దేబ్జానీ కి ఇచ్చాడు. చరణ్.. ఝాన్సీ ని నామినేట్ చేసాడు. తన పాయింట్స్ చెప్పి చివర్లో రైతు బిడ్డ అని ఎక్కువ ప్రమోట్ చేసుకోకు, షర్ట్, టవల్ వేసుకోకు అవి నాకు తప్పుగా అనిపించాయి అన్నాడు. కానీ ఝాన్సీ నేను రైతు బిడ్డనే, నా ఇష్టం అని చెప్పి వాదించింది. ఇక దేబ్జానీ.. త్రిగున్ ని కాఫీ దొంగతనం చేసినందుకు నామినేట్ చేసింది. ఈ రోజు ఇక్కడితో ఆపేసారు. రేపు నామినేషన్స్ మల్లి కొనసాగనున్నాయి.

చివర్లో చరణ్ – అమన్ తో మాట్లాడుతూ.. అసలు ముకేశ్ కి నలుగురు ఓటేస్తేనే స్టార్ ప్లేయర్ వచ్చింది. హౌస్ లో పద్నాలుగు మంది ఉన్నారు. అతనికి ఎలా ఇచ్చారు బెస్ట్ ప్లేయర్ అని కౌంటర్లు వేసాడు.

Also Read : Paradise Censor Review: ‘ది ప్యారడైజ్’కి A సర్టిఫికెట్.. బాబోయ్ ఎన్ని కట్స్ ఇచ్చారో తెలుసా.. సినిమా నిడివి ఎంతంటే..?