Demon Pavan-Rithu Chowdary : ఆమె నన్ను బ్లాక్ చేసింది.. తెగిపోయిన బిగ్‌బాస్ బంధం.. డిమాన్ పవన్ ఎమోషనల్ పోస్ట్
బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డిమాన్ పవన్, బుల్లితెర నటి రీతూ చౌదరి(Demon Pavan-Rithu Chowdary).
- Thota Vamshi Kumar
- Updated on- September 30, 2026 / 12:29 PM IST
Bigg Boss telugu fame Demon Pavan and Rithu Chowdary break up
Demon Pavan-Rithu Chowdary : బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డిమాన్ పవన్, బుల్లితెర నటి రీతూ చౌదరి. ప్రస్తుతం వీరిద్దరు విడిపోయారు అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది. తమ మధ్య ఉన్న బంధానికి బ్రేకప్ చెబుతున్నట్లుగా డిమాన్ పవన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. ఇక పై తమ బంధం కొనసాగదని వెల్లడించాడు.
#రివాన్ (రీతూ-పవన్) గురించి వరుసగా మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే దీనిపై మాట్లాడాలని అనుకున్నాను అంటూ డిమాన్ పవన్ తెలిపాడు. రీతూను తాను ఉపయోగించుకున్నాను లేదా రీతూ తనను ఉపయోగించుకుంది.. ఇంకేదో జరిగింది అంటూ వస్తున్న నెగెటివిటీ, పుకార్లతో తాను విసిగిపోయానన్నాడు. బిగ్‌బాస్‌లో మీరంతా చూసింది, నిజ జీవితంలో జరిగింది కూడా రెండు పూర్తిగా వేరు వేరు అని చెప్పుకొచ్చాడు.
ఎవరిని ఎవరూ ఉపయోగించుకోలేదన్నాడు. గతంలో తాము కలిసి పనిచేశామని, ఇకపై రివాన్ ఉండదని తెలిపాడు. తమ మధ్య ఉన్న స్నేహం పూర్తిగా బ్రేకప్ అయిందన్నాడు. గతంలో మంచి రిలేషన్ మెంటైన్ చేశామని, అయితే.. ఏ బంధంలోనైనా వ్యక్తిగత సమస్యలు ఉంటాయన్నాడు. గత కొన్నాళ్లుగా ఎన్నో సార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని చెప్పుకొచ్చాడు. ప్రతిసారీ తానే అర్థం చేసుకుని సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినట్లుగా తెలిపాడు. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని, గొడవలు మరింత పెద్దవి అవుతున్నాయన్నాడు.
అందుకనే ప్రశాంతత కోసం ఇక పై ప్రాజెక్టులను విడివిడిగా చేసుకోవాలని అనుకున్నామన్నాడు. ఆమె తనను వాట్సాప్‌లో బ్లాక్ చేసి స్నాప్‌లో తొలగించిందన్నాడు. అది తనకు నచ్చలేదన్నాడు. అందుకే తనను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఆమె తనను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్లాక్ చేసిందని తెలిపాడు. ఇక తాను ఏ పోస్టులను డిలీట్ చేయలేదని, అందరి సపోర్ట్‌కి ధన్యవాదాలు చెబుతూ పవన్ భావోద్వేగానికి గురి అయ్యాడు.
