Bigg Boss Telugu Offer
Bigg Boss Telugu Offer: బిగ్ బాస్ తెలుగు సీజన్ ఇప్పటికే స్టార్ట్ అయింది. పోటీ చేసేవారి లిస్ట్ కూడా వచ్చేసింది. బిగ్ బాస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి బిగ్ బాస్‌లో ఉంటారని చర్చ జరిగింది. తాను ఉంటానని మాధురి కూడా ఓ సారి అన్నారు. కానీ, బిగ్ బాస్‌లో వారిద్దరూ లేరు.
దీనిపై దువ్వాడ శ్రీనివాస్ 10టీవీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. “నిజానికి మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. ఆ టీమ్ వచ్చింది. వచ్చి మాట్లాడారు.. అగ్రీమెంట్ ఇవ్వాలని కోరారు.
వెంటనే ఏడో తారీకు నుంచి స్టార్ట్ అవుతుందని అన్నారు. కానీ, మేము వెళ్తే మూడు నెలలు అక్కడే ఉండడానికి సిద్ధపడాలి. ఒకవేళ రెండు, మూడు వారాల్లో తిరిగి వచ్చేస్తే ప్రాబ్లం లేదు. మూడు నెలలు అక్కడే ఉంటే పరిస్థితి ఏంటి?
మా బిజినెస్‌లు, పెట్టుబుడులు ఇవన్నీ ఉన్నాయి. విశాఖపట్నంలో ఓ బ్రాంచ్, జూబ్లీ హిల్స్ లో మరో బ్రాంచ్ రెడీ అవుతుంది. ప్రస్తుతానికి వెళ్లటం కష్టం అని సున్నితంగా మేము రాలేమని చెప్పాం. అందుకే వెళ్లలేదు.
సినిమా అంటే నాకు కొంచెం ఇష్టం. ఎందుకంటే డీఎఫ్టీ డిప్లొమా ఇన్ ఫిలిం ట్రాకింగ్ అండ్ డీఎఫ్ఏ.. ఈ రెండిటినీ చేశాను. అవకాశం రాలేదు.. ఆ ఫీల్డ్ కి మనం పనికి రామని అనుకున్నాం. రాజకీయాల్లో స్థిరపడిపోయాం.
పార్టీ మీద వలంటీర్ అని ఒక సినిమా కూడా తీశాను. అది నా సొంతంగా నేను, మాధురి కలిపి తీశాము. ఫైట్స్ కూడా ఉన్నాయి. అందులో కొంచెం విజువల్ వాల్యూస్ తక్కువ. కానీ ఎలాగో తీశాం.. రిలీజ్ చేశాం. సో నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు చూద్దాం.. అది ఇంట్రెస్టే కాబట్టి చూద్దాం” అని అన్నారు.