Bigg Boss Nominations : ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారు..? మంటల్లో చెయ్యి పెట్టిన ఆదిత్య.. నిఖిల్‌కి షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్..

సోమవారం యధావిధిగా నామినేషన్స్ జరిగాయి. ఎప్పటిలాగే నామినేషన్స్ వేస్తుంటే కంటెస్టెంట్స్ మధ్య వాదులాటలు జరిగాయి.

Bigg Boss Telugu Season 8 Fifth Week Nominations List Here

Bigg Boss Nominations : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగు వారాలు ముగిసింది. మొదటి మూడు వారాల్లో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వగా, నాలుగో వారం సోనియా ఎలిమినేట్ అయింది. దీంతో ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక సోమవారం యధావిధిగా నామినేషన్స్ జరిగాయి. ఎప్పటిలాగే నామినేషన్స్ వేస్తుంటే కంటెస్టెంట్స్ మధ్య వాదులాటలు జరిగాయి.

ఈ సారి బిగ్ బాస్ ఎవరినైతే నామినేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలను అక్కడున్న మంటల్లో వేసి నామినేట్ చేయాలని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ ఫొటోలు మంటలకు బలయ్యాయి. అయితే ప్రేరణ.. ఆదిత్యకు కాన్ఫిడెన్స్ తగ్గిందని చెప్పి అతని ఫోటో మంటల్లో వేయడంతో నాకు కాన్ఫిడెన్స్ తగ్గలేదు అంటూ మంటల్లో చెయ్యి పెట్టి మరీ అతని ఫోటోని బయటకు తీసి ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పాడు. అయితే మంటల్లో చెయ్యి పెట్టినందుకు బిగ్ బాస్ ఆదిత్య ఓంకు వార్నింగ్ ఇవ్వడంతో క్షమించమని కోరాడు.

Also Read : Rajinikanth : అర్ధరాత్రి హాస్పిటల్లో చేరిన రజినీకాంత్.. ఆందోళనలో అభిమానులు..

ఇక రెండు టీమ్స్ చీఫ్ లలో ఎవరో ఒకరినే నామినేట్ చేయాలి అని కంటెస్టెంట్స్ కి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో యష్మి, పృథ్వి తప్ప మిగిలిన వాళ్లంతా నిఖిల్ ని నామినేట్ చేసి సీతను సేఫ్ చేసారు. దీంతో హౌస్ మేట్స్ అంతా తనకి వ్యతిరేకంగా ఉన్నాడని ఒక్కసారిగా నిఖిల్ ఖంగుతిన్నాడు. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో నిఖిల్‌, నైనిక, విష్ణుప్రియ, నాగమణికంఠ, ఆదిత్య ఓం, నబీల్‌ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ ఐదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.