Shekar Basha : బిగ్ బాస్ హౌస్ నుంచి.. అప్పుడే శేఖర్ బాషాని పంపించేస్తున్నారా?

మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అవ్వగా రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా చూస్తున్నారు.

Bigg Boss Telugu Season 8 Second Week Shekar Basha will Eliminate Rumours goes Viral

Shekar Basha : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలయి రెండో వారం కూడా పూర్తవుతుంది. మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అవ్వగా రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా చూస్తున్నారు. రెండో వారం నాగమణికంఠ, కిరాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్‌ బాషా, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్‌ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా పృథ్వీ శెట్టి వెళ్లిపోవడానికి అవకాశం ఉన్నా శేఖర్ బాషాని ఎలిమినేట్ చేశారని తెలుస్తుంది.

Also Read : Pawan Kalyan – Amitabh : ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం గురించి ప్రశ్న.. పవన్‌ని పొగిడిన అమితాబ్..

ఇప్పటికే బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ అయిపోగా నేడు శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడని బిగ్ బాస్ లీక్స్ నుంచి సమాచారం. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో కాస్తో కూస్తో తన కుళ్ళు జోకులతో ప్రేక్షకులని నవ్వించడానికి శేఖర్ బాషా ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటిది అతన్ని పంపించేస్తే హౌస్ లో కామెడీ ఎంటర్టైన్మెంట్ పోయినట్టే. అసలు ఎవరికీ తెలియని వాళ్ళని, హౌస్ లో అసలు యాక్టివ్ గా లేని వాళ్ళని కూడా ఉంచుతున్నారు అలాంటిది శేఖర్ బాషాని పంపించడం ఏంటో అని అనుకుంటున్నారు. మొదటివారం కూడా బేబక్కని అనవసరంగా పంపించారు అని అంతా ఫీల్ అయ్యారు.