Bigg Boss 8 – RJ Shekar Basha : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున హోస్టింగ్ తో అందరికి స్వాగతం చెప్తుండగా కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల, ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క రాగా ఎనిమిదో కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : Bigg boss 8 – Bezawada Bebakka : బిగ్ బాస్ సీజన్ 8.. ఏడో కంటెస్టెంట్.. బెజవాడ బేబక్క గురించి తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎనిమిదో కంటెస్టెంట్ గా రాజ్ తరుణ్ ఫ్రెండ్, ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల వరకు కూడా ఆర్జే శేఖర్ బాషా ఎవ్వరికి తెలీదు. బిగ్ FM లో ఆర్జేగా పనిచేసే శేఖర్ బాషా ఇటీవల రాజ్ తరుణ్ – లావణ్య వివాదంలో రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా మాట్లాడి ఫేమస్ అయ్యాడు. ఆ ఇష్యూలో రాజ్ తరుణ్ తరపున మీడియా ముందు మాట్లాడి, ఇంటర్వ్యూలు ఇచ్చి వైరల్ అయ్యాడు. ఇప్పుడు ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.