Bigg boss 8 – Bezawada Bebakka : బిగ్ బాస్ సీజన్ 8.. ఏడో కంటెస్టెంట్.. బెజవాడ బేబక్క గురించి తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఏడో కంటెస్టెంట్ గా స్టాండప్ కమెడియన్, సింగర్ బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Telugu Season 8 Started Seventh Contestant Bezawada Bebakka
Bigg boss 8 – Bezawada Bebakka : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది. నాగార్జున హోస్టింగ్ తో అదరగొడుతున్నారు. కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల రాగా ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క వచ్చింది.
Also Read : Bigg Boss 8 – Soniya : బిగ్ బాస్ సీజన్ 8.. ఆరో కంటెస్టెంట్.. ఆర్జీవీ భామ, నటి సోనియా.. ఎవరో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఏడో కంటెస్టెంట్ గా స్టాండప్ కమెడియన్, సింగర్ బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది. బెజవాడ బేబక్క అసలు పేరు మధూ. సింగర్ గా, స్టాండప్ కమెడియన్ గా పాపులర్ అయిన ఈమె సోషల్ మీడియాలో బెజవాడ బేబక్క అనే పేరుతో కామెడీ రీల్స్ చేస్తుంది. తన రీల్స్ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా అమెరికాలో ఉంటూ అక్కడి పరిస్థితులని కామెడీగా రీల్స్ రూపంలో చూపిస్తూ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా రీల్స్ తోనే ఈమెకు ఎక్కువ పేరు రావడంతో బెజవాడ బేబక్క పేరే ఫిక్స్ చేసేసారు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో నవ్వించిన బెజవాడ బేబక్క అలియాస్ మధూ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంత నవ్విస్తుందో చూడాలి.