Bigg Boss 8 – Soniya : బిగ్ బాస్ సీజన్ 8.. ఆరో కంటెస్టెంట్.. ఆర్జీవీ భామ, నటి సోనియా.. ఎవరో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Telugu Season 8 Started Sixth Contestant RGV Actress Soniya Akula
Bigg Boss 8 – Soniya : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నాగార్జున హోస్టింగ్ తో గ్రాండ్ గా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం రాగా ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల వచ్చింది.
Also Read : Bigg Boss 8 – Aditya Om : బిగ్ బాస్ సీజన్ 8.. ఐదో కంటెస్టెంట్.. హీరో ఆదిత్య ఓం రీ ఎంట్రీ..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. ప్రతి సీజన్ లోను ఆర్జీవీ కాంపౌండ్ లోని ఒక నటిని తీసుకొస్తారని తెలిసిందే. అలా ఈసారి ఆ అదృష్టం సోనియాకు దక్కింది. ఆర్జీవీ ప్రొడక్షన్ లో ఆశ, కరోనా లాంటి పలు సినిమాల్లో నటిగా చేసింది ఈ భామ. సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్న సోనియాకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో హౌస్ లోకి వచ్చేసింది. మరి ఈ బిగ్ బాస్ తన కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.