Bigg Boss 8 – Aditya Om : బిగ్ బాస్ సీజన్ 8.. ఐదో కంటెస్టెంట్.. హీరో ఆదిత్య ఓం రీ ఎంట్రీ..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు.
Bigg Boss 8 – Aditya Om : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాగార్జున హోస్ట్ తో గ్రాండ్ గా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇస్తున్నారు. నాగార్జున హోస్ట్ గా అందరికి స్వాగతం చెప్తున్నాడు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ రాగా, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ రాగా ఇప్పుడు ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : Pawan Kalyan – OG : పవన్ పుట్టిన రోజుకు OG టీమ్ గిఫ్ట్ ఇదే.. వర్షాల వల్ల వాయిదా వేసినా..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. ఒకప్పుడు హీరోగా లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యు, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, మా అన్నయ్య బంగారం.. ఇలా అనేక సినిమాలతో మెప్పించాడు. కానీ ఫ్లాప్స్ రావడంతో కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరమయి ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు రీ ఎంట్రీ లో బిగ్ బాస్ లోకి వచ్చాడు. మరి ఈ బిగ్ బాస్ ఆదిత్య ఓం రీ ఎంట్రీ కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.