Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu: బుల్లి తెరపై మరోసారి రియాలిటీ షోస్ సందడి మొదలు కానుంది. ఒకపక్క జూనియర్ ఎన్టీఆర్ రండి గెలుద్దాం అంటూ ఎవరు మీలో కోటీశ్వరుడుతో ప్రతి ఇంటికి వచ్చేందుకు సిద్ధమైతే.. మరోవైపు బిగ్గెస్ట్ క్రేజీ షో బిగ్ బాస్ తాజా సీజన్ కూడా సరికొత్తగా వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కు సిద్ధమవుతోంది.
ఇప్పటికే సరికొత్తగా హౌస్ సెట్ సిద్ధం చేసిన షో నిర్వాహకులు.. ఐదవ సీజన్ లోగోను కూడా విడుదల చేశారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈలోగా ఈ షో మీదున్న క్రేజ్ తో ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరెవరు అనేది అంచనాలు కూడా బయటకొచ్చాయి. అందులో వెండితెర నుండి సోషల్ మీడియా సెలబ్రిటీల వరకు ఎందరో ఉన్నారు. ఈ కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉంటారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే చక్కర్లు కొట్టే జాబితాతో పాటు జాంబీరెడ్డి సినిమాలో నటించిన లహరి శారి ఈసారి హౌస్ లో ఉండనుందని ఇప్పుడు మరో కథనం ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు నిజం.. అసలు ఫైనల్ కంటెస్టెంట్స్ జాబితా ఏంటన్నది మరో వారం పదిరోజులలో తేలనుండగా ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు దాదాపుగా ఖరారైంది. ఇక దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.