BiggBoss 6 Day 24 : ఓ వైపు కెప్టెన్సీ టాస్కులు.. మరోవైపు అర్ధరాత్రి బెడ్ పై కంటెస్టెంట్స్ ఏం చేశారో తెలుసా??
ఓ వైపు ఇలా కెప్టెన్సీ టాస్కులు పోటాపోటీగా సాగుతుంటే రాత్రిపూట కంటెస్టెంట్స్ రెచ్చిపోతున్నారు. రాజ్, ఇనయ ఒకే బెడ్‌పై పడుకొని దుప్పటి కప్పుకొని ఒకరి మీద ఒకరు.......

BiggBoss 6 Day 24 performances captaincy tasks and romantic angles in house
BiggBoss 6 Day 23 : బిగ్‌బాస్ సీజన్ 6 అప్పుడప్పుడు చప్పగా, అప్పుడప్పుడు హీట్ హీట్ గా సాగుతోంది. నాలుగో వారం నామినేషన్లు పూర్తవడంతో అంతా కెప్టెన్సీ టాస్కులలో పోరాడుతున్నారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ కి గతంలో ఇచ్చినట్టే హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ లో బిగ్‌బాస్ హోటల్ స్టాఫ్ కంటే గ్లామ్ రెస్టారెంట్ స్టాఫ్ వద్ద ఎక్కువ మనీ ఉండటంతో వాళ్లు విన్నర్స్ అయ్యారు. దీంతో బిగ్‌బాస్ హోటల్‌ని స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఇందులో చంటికి బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినా అది చంటి చేయలేకపోయాడు. దీంతో చంటిని ఈ వారం కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు బిగ్‌బాస్. ఇక కంటెస్టెంట్స్ లో ఉన్న అమ్మాయిల్లో ఫైమా, శ్రీ సత్య, వసంతి, ఆరోహి, కీర్తి కలిసి రెండు హోటల్స్ నుంచి ఒక్కొక్కరిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించమనడంతో అందరూ కలిసి రేవంత్, బాలాదిత్యలను కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించారు. దీంతో మరోసారి రేవంత్ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో రేవంత్ కి, ఆ లేడీ కంటెస్టెంట్స్ కి మధ్య గొడవ జరిగింది.
Mahesh Babu: ఒకే ఏడాదిలో మహేష్ ఇంట రెండు విషాదాలు..!
ఓ వైపు ఇలా కెప్టెన్సీ టాస్కులు పోటాపోటీగా సాగుతుంటే రాత్రిపూట కంటెస్టెంట్స్ రెచ్చిపోతున్నారు. రాజ్, ఇనయ ఒకే బెడ్‌పై పడుకొని దుప్పటి కప్పుకొని ఒకరి మీద ఒకరు పడేలా పడుకొని గుసగుసలు చెప్పుకున్నారు. దీంతో ఇనయా, రాజ్ వ్యవహారం చర్చగా మారింది. మరోవైపు రేవంత్ తో ఇనయా కాళ్ళు పట్టించుకోవడం, దానికి ఇనయా డబ్బులు ఇవ్వడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఇక భార్య భర్తలు మరీనా, రోహిత్ లు కూడా బెడ్ పై హగ్ చేసుకొని పడుకున్నారు. అలాగే ముందు నుంచి అనుకున్నట్టే అర్జున్ శ్రీ సత్యని బాగా ట్రై చేస్తున్నాడు. కానీ శ్రీ సత్య మాత్రం ఏమి తెలియనట్టు ఉంటుంది. ఇలా రాత్రిపూట ఈ పులిహారలు మొదలుపెట్టి హౌస్ లో రొమాంటిక్ యాంగిల్ చూపిస్తున్నాడు బిగ్‌బాస్ అని తెలుస్తుంది.