BiggBoss 6 Day 51 : కెప్టెన్సీ టాస్క్ కోసం ఒకరి మీద ఒకరు పడిపోయి.. తిట్లతో, అరుపులతో దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌజ్..

బిగ్‌బాస్ లో సోమవారం నాడు నామినేషన్స్ తో చాలా హీట్ గా జరగడంతో ఇక మంగళవారం ఆ హీట్ మరింత వేడెక్కింది. మంగళవారం కెప్టెన్సీ టాస్క్ ని మొదలుపెట్టారు. మొదట గాలిలో నుంచి చేపలు పడతాయి. ఆ చేపలు............

BiggBoss 6 Day 51 : కెప్టెన్సీ టాస్క్ కోసం ఒకరి మీద ఒకరు పడిపోయి.. తిట్లతో, అరుపులతో దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌజ్..

BiggBoss 6 Day 51 contestants fight in cptaincy task

Updated On : October 26, 2022 / 6:45 AM IST

BiggBoss 6 Day 51 :  బిగ్‌బాస్ లో సోమవారం నాడు నామినేషన్స్ తో చాలా హీట్ గా జరగడంతో ఇక మంగళవారం ఆ హీట్ మరింత వేడెక్కింది. మంగళవారం కెప్టెన్సీ టాస్క్ ని మొదలుపెట్టారు. మొదట గాలిలో నుంచి చేపలు పడతాయి. ఆ చేపలు పట్టుకోవాలి, ఎవరు ఎక్కువ చేపలు పట్టుకుంటే వారే నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు అని చెప్పాడు బిగ్‌బాస్. ఈ లెవెల్ ని జంటలుగా ఆడారు. ఇద్దరిద్దరు కలిసి చేపలు పట్టడానికి ట్రై చేశారు.

చేపలు పట్టుకోవడం, వాటిని దాచుకోవడం చాలా పెద్ద టాస్క్ గా మారింది. చేపలు పట్టే విషయంలో ఒకర్నొకరు తోసుకొని, ఒకరి మీద ఒకరు పడి, ఒకరి చేపలు ఇంకొకరు లాక్కొని బిగ్‌బాస్ హౌజ్ లో విధ్వంసం సృష్టించారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలో అందరి మధ్య గొడవలు అయ్యాయి. ఒకర్నొకరు తమ చేపలు లాక్కోవడానికి ఇంకొకరిని తోసేశారు కూడా. ఈ నేపథ్యంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. ఇనయా, రేవంత్ జంటగా రెచ్చిపోయి మరీ ఆడారు. దీంతో రెండు సార్లు వాళ్ళే విన్నర్స్ గా నిలిచారు. ఇక గీతూ తిట్లు మొదలుపెట్టింది. గీతూ ఎప్పటిలాగే నేనే తోపు అన్న ఫీల్ తో మెరీనా, రోహిత్ తో గొడవ పెట్టుకుంది. అయితే గీతూ ఓడిపోవడంతో ఏడ్చేసింది. గీతూకి, సత్యకి కాళ్ళకి దెబ్బలు తగిలాయి ఈ గేమ్ లో.

BiggBoss 6 Day 50 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా??

ఆ తర్వాత మరో లెవెల్ లో ఒక నలుగురిని తోపుడు బండి మీద కూర్చోపెట్టి ఇద్దరిద్దరు జంటల్ని ఆ బండిని తోయమని, ఎవరి వైపు ముందు వెళ్తే వాళ్ళు ఓడిపోయినట్టు చెప్పాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ లో కూడా మాటల యుద్ధమే జరిగింది. ఇక్కడ కూడా ఇనయా, రేవంత్ రెచ్చిపోయారు. ఈ టాస్క్ కి సంచలక్ గా ఉన్న సూర్యతో గొడవ పెట్టుకున్నారు. ఈ టాస్క్ నేడు కూడా కొనసాగుతుంది. మరి కెప్టెన్ గా ఈ వారం ఎవరు విన్ అవుతారో చూడాలి.