×
Ad

BiggBoss 7 : బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నవారు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారు..?

బిగ్‌బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నవారు తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని ఎలా ఉపయోగించుకుంటారు. ఓటు వేయడానికి బయటకి వస్తారా..?

  • Published On : November 30, 2023 / 12:05 PM IST

BiggBoss 7 contestants how to cast their votes in Assembly Elections 2023

BiggBoss 7 : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఫినాలేకి చేరువలో ఉంది. ప్రస్తుతం ‘టికెట్ టూ ఫినాలే’ అంటూ మొదటి ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేసే ప్రక్రియ నడుస్తుంది. దీంతో రెండు రోజులు నుంచి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ పెడుతూ వస్తున్నాడు బిగ్‌బాస్. ఇక ఫైనల్ కి చేరుకునేందుకు కంటెస్టెంట్స్ కూడా టాస్క్ లో టఫ్ కంపిటేషన్ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో అమర్, శివాజీ, గౌతమ్, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, శోభా శెట్టి.. ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కాగా నేడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ప్రతి ఒకరు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్స్ కూడా తమ ఓటు వేసేందుకు వస్తున్నారు. ఈక్రమంలోనే కింగ్ నాగార్జున కూడా తన ఓటు వేసేందుకు వచ్చారు. ఇక ఓటు హక్కుని ఉపయోగించుకున్న నాగార్జున చూసి నెటిజెన్స్ బుర్రలో ఒక సందేహం మొదలైంది. బిగ్‌బాస్ హోస్ట్ తన ఓటుని వేశారు. మరి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వచ్చి ఓటు వెయ్యరా..? వాళ్ళు తమ ఓటు వెయ్యడానికి బయటకి వస్తారా..? అనే డౌట్స్ కొందరు నెటిజెన్స్ కి వచ్చాయి.

Also read : Allu Arjun : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఫాలోవర్స్ పెరగాలంటూ.. అల్లు అర్జున్ వీడియో..

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనల్ రెండు వారాల దూరంలో ఉంది. ఈ సమయంలో కంటెస్టెంట్స్ ని బయటకి తీసుకు రావడం అనేది కష్టమే అని తెలుస్తుంది. మరి కంటెస్టెంట్స్ తమ ఓటు హక్కుని ఎలా ఉపయోగించుకుంటారు. సాధారణంగా.. ప్రభుత్వం లేదా ఇతర ప్రత్యేక విధుల్లో భాగంగా బయటకి వెళ్లి పోలింగ్ బూత్ కి దూరంగా ఉన్నవారికి.. ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా తమ ఓటుని వేసే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఈక్రమంలోనే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కూడా ఓటు వేసే హక్కు కలిపించి ఉండవచ్చని తెలుస్తుంది.