Allu Arjun : ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరగాలంటూ.. అల్లు అర్జున్ వీడియో.. ఎవరా అమ్మాయి?

ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఫాలోవర్స్ పెరగాలంటూ అల్లు అర్జున్ పోలింగ్ బూత్ వద్ద ఓ వీడియో చేశారు.

Allu Arjun : ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరగాలంటూ.. అల్లు అర్జున్ వీడియో.. ఎవరా అమ్మాయి?

Pushpa 2 hero Allu Arjun made reel with social media women influencer

Allu Arjun :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ పై ఒక రికార్డు కూడా ఉంది. అయితే తాజాగా ఈ ఐకాన్ స్టార్ మరొకరి ఫాలోవర్స్ పెంచడానికి సహాయం అందిస్తున్నారు. అల్లు అర్జున్ ఇంట్లో ఎప్పట్నుంచో పని చేస్తున్న అశ్విని అనే అమ్మాయికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచడానికి ఒక ప్రత్యేక వీడియో చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ ఇంట్లో పనిచేసే అశ్విని అనే అమ్మాయికి ఆల్రెడీ సోషల్ మీడియాలో దాదాపు 13000 మంది ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ ఆమె కోసం చేసిన వీడియోలో.. “నీకు మంచి ఫాలోవర్స్ రావాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు 13K ఫాలోవర్స్ ఉన్నారు ఈ వీడియోతో 30K ఫాలోవర్స్ వస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోని ఆ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.

Also Read : Brahmanandam : మీడియాకు బ్రహ్మానందం కామెడీ కౌంటర్.. ఓటేయడానికి వచ్చి బ్రహ్మి కామెడీ మార్క్..

ఈ వీడియో పోస్టు చేసిన కాసేపటిలోనే 18000 వరకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. ప్రస్తుతం ఆ ఫాలోవర్స్ కౌంట్ ఇంకా పెరుగుతూనే వెళ్తుంది. దీంతో అల్లు అర్జున్ ఈ రకంగా కూడా హెల్ప్ చేస్తున్నాడు అంటూ అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.

View this post on Instagram

 

A post shared by _its_me_ashwini_❤️‍🩹 (@_its_me_ashwini_23)