Gautham Krishna : బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌కి కంటెస్టెంట్ గా వెళ్లి చాలామంది స్టార్ స్టేటస్ ని అందుకుంటారు. ఇక అక్కడ వచ్చిన ఫేమ్ ని ఉపయోగించుకొని సినిమాల్లో రాణించాలని ఆశ పడుతుంటారు. అయితే అలా ప్రయత్నించిన ప్రతి ఒక్కరు బోల్తా పడుతున్నారు. ఇతర భాషల్లో బిగ్‌బాస్ ద్వారా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. కానీ తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కి మాత్రం ఆ అదృష్టం కలిసి రావడం లేదు.
ఇక తాజాగా బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ కూడా అదే బాటలో ప్రయత్నిస్తూ.. హీరోగా ఓ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ‘సోలో బాయ్’ అనే టైటిల్ తో ఒక సినిమాని సిద్ధం చేస్తున్నారు. కొత్త దర్శకుడు పి నవీన్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మరి లవ్ జోనర్‌లో రాబోతోందా..? ఫ్యామిలీ జోనర్‌లో రాబోతోందా..? అనేది తెలియాలి.
Also read : Siddhu Jonnalagadda : ‘జాక్’ నాకు కొంచెం క్రాక్ అంటూ వచ్చేస్తున్న సిద్దు..
సెవెన్ హిల్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాత గతంలో ‘బట్టల రామస్వామి’ బయోపిక్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఆ చిత్రం.. ఆడియన్స్ ని నవ్వించి మంచి విజయానే అందుకుంది. జుడా సందే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే, సీజన్ 7 లోని మరో కంటెస్టెంట్ ‘ఆట సందీప్’.. ఈ సినిమాలోని పాటలు అన్నిటికి కోరియోగ్రఫీ చేయబోతున్నారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, ఆనంద్ చక్రపాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.
కాగా గౌతమ్ కృష్ణ డాక్టర్ మరియు MBA కూడా చేశారు. అయితే నటన పై ఆసక్తి ఉండడంతో.. అటుగా ప్రయత్నాలు కూడా చేశారు. ఈక్రమంలోనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన గౌతమ్ కృష్ణ.. ‘ఆకాశవీధుల్లో’ అనే సినిమాలో హీరోగా చేశారు. ఇక బిగ్‌బాస్ లో 13 వారాలు పాటు ఉన్న గౌతమ్.. ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చి ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. మరి ఆ ఫేమ్ ఇప్పుడు వెండితెర పై ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.