Siddhu Jonnalagadda : ‘జాక్’ నాకు కొంచెం క్రాక్ అంటూ వచ్చేస్తున్న సిద్దు..
సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ వచ్చేసింది.

Siddhu Jonnalagadda Vaishnavi Chaitanya SVCC37 movie Titled as jack
Siddhu Jonnalagadda : టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ తో ముందుకు దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఒకటే.. బొమ్మరిల్లు భాస్కర్ తో తెరకెక్కిస్తున్న చిత్రం. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ చిత్రం.. #SVCC37 వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వెళ్తుంది.
తాజాగా నేడు ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘జాక్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ మూవీలోని సిద్దు పాత్ర క్రాక్‌గా ఉంటుందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవి ముస్లిం అమ్మాయి పాత్రని పోషిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. సిద్దు, వైష్ణవి పెయిర్ కూడా ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ కలిపిస్తుంది. మరి జంట వెండితెర పై ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Also read : Rajamouli : మరోసారి రాజమౌళి వర్క్ గురించి మాట్లాడిన జేమ్స్ కామెరాన్..
కాగా బొమ్మరిల్లు సినిమాతో ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్న భాస్కర్.. ఆ తరువాత కొన్ని ప్లాప్స్ తో ఇబ్బందులు చూసారు. అయితే ఇటీవల అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తీసి మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. క్యారెక్టర్స్ పాత్రని చాలా ప్రత్యేకంగా చూపించడంలో భాస్కర్ దిట్ట, అలాగే పాత్రని ప్రత్యేకంగా ప్రదర్శించడంలో సిద్దు దిట్ట.. దీంతో ఈ జాక్ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాని SVCC పతాకంపై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రంతో పాటు సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు స్క్వేర్, తెలుసు కదా సినిమాలు కూడా చేస్తున్నారు. డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్.. మార్చి 29న రిలీజ్ కాబోతుంది. ఇక ‘తెలుసు కదా’ సినిమాతో ప్రముఖ స్టైలిష్ నీరజ కోన డైరెక్ట్ చేస్తున్నారు.