Rajamouli : మరోసారి రాజమౌళి వర్క్ గురించి మాట్లాడిన జేమ్స్ కామెరాన్..

మరోసారి రాజమౌళి వర్క్ గురించి మాట్లాడిన వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్.

Rajamouli : మరోసారి రాజమౌళి వర్క్ గురించి మాట్లాడిన జేమ్స్ కామెరాన్..

James Cameron great words about tollywood director Rajamouli

Updated On : February 7, 2024 / 10:13 AM IST

Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. తన సినిమాలతో తెలుగు సినిమాని మాత్రమే కాదు, ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో హాలీవుడ్ టాప్ ఫిలిం మేకర్స్.. మన సినిమాల గురించి మాట్లాడుకునేలా, మన సినిమాల కోసం ఎదురు చూసేలా చేశారు. ప్రస్తుతం హాలీవుడ్ వారంతా.. రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు.

ఇలా ఎదురు చేసేవారిలో వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ కూడా ఉన్నారు. అవతార్ లాంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన జేమ్స్ కామెరాన్.. ఆర్ఆర్ఆర్ సినిమా చూసి ఒక ప్రత్యేక వీడియోతో మూవీ పై తన అభిప్రాయం, తన ఇష్టాన్ని తెలియజేశారు. ఆ సమయంలో ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ తరువాత కూడా పలు ఇంటర్వ్యూల్లో జేమ్స్ కామెరాన్, రాజమౌళి గురించి మాట్లాడుతూనే వస్తున్నారు.

Also read : Upasana : మెగా కోడలు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ‌పై ఉపాసన కామెంట్స్..

హాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్ లో జేమ్స్ కామెరాన్ పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో జేమ్స్ కామెరాన్‌ని.. “మీకు ఎవరు స్ఫూర్తి. మిమ్మల్ని ఇలా టాప్ డైరెక్టర్ గా చేయడానికి ఎవరు దోహద పడ్డారు” అని ప్రశ్నించారు. దీనికి జేమ్స్ కామెరాన్ బదులిస్తూ.. “నేను చాలామందిని చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటాను. స్టీవెన్ స్పీల్‌బెర్గ్ వక్ చూసుకుంటే, ప్రతిదీ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే కొత్త ఫిలిం మేకర్స్ తెరకెక్కించే సినిమాలు చూసినప్పుడు కూడా.. ఆ ఆలోచన నాకు రాలేదు అని బాధ పడుతుంటా. దీంతో నేను ఇంకొంచెం కొత్తగా ఆలోచిస్తుంటా” అంటూ చెప్పుకొచ్చారు.

ఈక్రమంలోనే రాజమౌళి గురించి మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ సినిమాని చాలా అద్భుతంగా, ప్రపంచం మొత్తం ఇష్టపడేలా చాలా బాగా తెరకెక్కించారు. అలాగే ఇండియన్ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటుతుండడం చాలా గొప్పగా అనిపిస్తుంది” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.